Vaccines | పశు వైద్య శిబిరం ప్రారంభం

Vaccines | పశు వైద్య శిబిరం ప్రారంభం

  • పాడి పశువులను సంరక్షించుకుందాం

Vaccines | వేంసూరు, ఆంధ్రప్రభ : పాడి పశువులకు సకాలంలో వ్యాక్సిన్స్, వైద్య పరీక్షలు చేయించాలని సర్పంచ్ పెద్దగౌండ్ల ప్రసన్న ధర్మారావు పాడి రైతులకు సూచించారు. అమ్మపాలెం గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన పశు వైద్య శిభిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువుల వృద్ధికి, పాల దిగుబడి సాధించేందుకు ముందస్తు జ్యాగ్రత్తలు అవసరం అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న వైద్య సహాయక శిబిరాలను పశు పెంపకం దార్లు ఉపయోగించు కోవాలని కోరారు. పశు పోషణ, పశు సంరక్షణ, ప్రతి రైతు తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పశు పెంపకం దార్లు అందించే రుణాల వివరాలను తెలుసుకొని, తద్వారా పోషణ మరింత వృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డాక్టర్ సఫియా, డాక్టర్ రాజశేఖర్, వైద్య సిబ్బంది, గోపాల మిత్ర సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply