పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అసోడ కుమారస్వామి

చిట్యాల ,ఆంధ్రప్రభ : పశువుల పెంపకం దారులు,గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేయించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అసోడ కుమారస్వామి కోరారు. బుధవారం మండలలోని జడలపేట , బావుసింగ్ పల్లి, గ్రామాలల్లో 3 నెలలు పై పడిన దూడలకు, ఆవులు, గేదెలకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. కార్యక్రమాన్ని జడలపేట గ్రామ సర్పంచ్ కర్రు లక్ష్మి ప్రతాప్ రెడ్డి ,జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అసోడ కుమారస్వామి , ఆధ్వర్యంలో ప్రారంభించారు. చిట్యాల మండల పశువుల పెంపకం దారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి కోరారు.

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేయడం వలన వ్యాధి నుంచి రక్షించుకోవడమే కాకుండా పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి పెరుగుతుంద న్నారు. 235 పశువులకు టీకాలు వేసినట్లు పశువైద్యాధికారి అజయ్ అప్పని , తెలిపారు . మండలంలోని అన్ని గ్రామాలల్లో ఈ నెల 10 నుండి ఏప్రిల్ 9 వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

మండలంలోని అన్ని గ్రామాలలోని పశువుల పెంపకందారులు ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి వెంకన్న, వెటర్నరీ సర్జన్ డాక్టర్ అజయ్ అప్పని, పశు వైద్య సహాయ సిబ్బంది కవిత , దివ్య , కరుణాకర్ , రాజేందర్ రెడ్డి, సుజాత .లక్ష్మణ్ , రైతులు పాల్గొన్నారు.

Leave a Reply