పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు..

పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు..

విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం కల్పించిన ఆస్తి పన్ను పై 50 శాతం వడ్డీ మాఫీ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవడానికి మార్చి 31, చివరి రోజు కావున క్యాష్ కౌంటర్లలో రద్దీ ఎక్కువగా ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం సచివాలయాలు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అందు బాటు లో ఉంటాయని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ ఇంటి పన్ను ఖాళీ స్థల పన్ను బకాయిలు ఏక మొత్తంలో చెల్లించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన 50 శాతం వడ్డీ రాయితీని పొందటానికి నగరం లోని క్యాష్ కౌంటర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందు బాటు లో ఉండటమే కాకుండా ప్రజల సౌకర్యార్థం సచివాలయాలు కూడా ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

కావున ప్రజలందరూ పన్ను చెల్లింపులకు నగర పరిధిలో గల 286 సచివాలయాల్లో కూడా చెల్లించవచ్చని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 50 శాతం వడ్డీ రాయితీని పొందవచ్చని, ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

Leave a Reply