Utnoor | ఎస్సీఈఆర్టీ లకుఎఫ్ టి ఏ నిధులు విడుదల

Utnoor | ఎస్సీఈఆర్టీ లకుఎఫ్ టి ఏ నిధులు విడుదల
Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణా రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న 83 మంది ఎస్ సి ఆర్ పి లకు ఎఫ్ టి ఏ నిధులు ప్, జిల్లా ప్రధాన కార్యదర్శి జే శివాజీ, జిల్లా గౌరవ అధ్యక్షులు టేకం గోవిందరావు లు శనివారం తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు చెందిన 83 స్కూల్ కాంప్లెక్స్ లకు సంబంధించిన ఎస్సీఈఆర్టీ ల ఎఫ్ టి ఏ నిధులు నెలకు 800 రూపాయల చొప్పున ప్రతి ఎస్సీఈఆర్టీ లకు సంవత్సరంకు 9600/- రూపాయలు మంజూరైనాయని, రాష్ట్రం మొత్తంలో 86 స్కూల్స్ కు సంబందించిన 7,96,800 రూపాయలు మంజూరు అయినాయని. గత చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న నిధులు మంజూరు చేయాలనీ టీఎస్ టి డబ్ల్యూ టి యు రాష్ట్ర శాఖ పలు మార్లు ప్రభుత్వానికి ప్రాతినిథ్యం చేయగా ఈ నిధులు మంజూరు అయినాయని అందుకు సహకరించిన గిరిజన సంక్షేమఅధికారులకు, టీఎస్ టి డబ్ల్యూ టి యు సంఘ రాష్ట్ర నాయకులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
