Utnoor | కార్పోరేట్‌కి ధీటుగా ప్రభుత్వ కాలేజ్

Utnoor | కార్పోరేట్‌కి ధీటుగా ప్రభుత్వ కాలేజ్

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : కార్పోరేట్ కి ధీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య బోధనను అందించడం జరుగుతుందని, విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం అదిలాబాద్ జిల్లాఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి ప్రతాప్ సింగ్, అధ్యాపకులతో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని చేరేలా ప్రోత్సహించాలన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లలోఅనుభవజ్ఞులైన అధ్యాపకులుచే విద్యను బోధించడం జరుగుతుందని, విద్యతో పాటు ఆటపాటల్లో రాణించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారన్నారు. బాలురు, బాలికలకు వేరు వేరుగా హాస్టల్ సదుపాయం ఉందని, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కాగానే డిగ్రీ కళాశాలలకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి ప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply