ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు..

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు విద్యార్థులు బుధవారం ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర వృక్షశాస్త్రం, రాజనీతి శాస్త్రం పరీక్షలకు 87 మంది విద్యార్థులకు గాను ముగ్గురు విద్యార్థులు పరీక్షలకు గైరాజరైనట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ అంబాజీ, డిపార్ట్మెంటల్ అధికారి వెంకటేశ్వర్ నివాస్ తెలిపారు. ఒకేషనల్ పరీక్ష కు 38 మంది విద్యార్థులకు గాను 100 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లుతెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
