Utkoor | వైభవంగాఎల్లమ్మ జాతర వేడుకలు

Utkoor | వైభవంగాఎల్లమ్మ జాతర వేడుకలు
- భారీ బోనాలర్యాలీతో అమ్మవారినిదర్శించుకున్నభక్తులు.
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో గ్రామ దేవత ఎల్లమ్మ జాతర వేడుకలు భక్తులు ప్రజలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది వానాకాలం పంటలు వచ్చిన తర్వాత యాసంగి పంట సాగు సమయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఊట్కూర్ మండల కేంద్రంలోని శంకర్ గౌడ్ ఇంటి నుండి అమ్మవారి పెద్ద బోనంతో డప్పు మేళ తాళాలతో మహిళలు తలపై బోనాలు పెట్టుకుని భారీ ఊరేగింపుగా వచ్చి అమ్మవారి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ దేవత ఎల్లమ్మ జాతర వేడుకలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఊట్కూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఎల్లమ్మ జాతర వేడుకలు భక్తులు ఘనంగా జరుపుకున్నారు. జాతర పురస్కరించుకొని అమ్మవారికి గొర్రెలు మేకలు కోళ్లు కోసి నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. జాతరలో భక్తులకు తాగునీటి ఎద్దడి లేకుండా గ్రామపంచాయతీ సర్పంచ్ రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్,వార్డు సభ్యుడు నరేష్ కుమార్ ట్యాంకర్ ద్వారా భక్తులకు నీరు సరఫరా చేశారు. ఎల్లమ్మ జాతరలో మహిళల పూనకాలు డప్పు మేళ తాళాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎల్లమ్మ జాతర వేడుకలు భక్తులు ఐదు వారాలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు.
