Utkoor | సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Utkoor | సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పెద్దపోర్ల మండల అధ్యక్షుడు అంజప్ప ఆధ్వర్యంలో గురువారం బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి ఆపదలో ఉన్నవారికి వరంలాంటిదని అన్నారు. పెద్ద పొర్ల గ్రామానికి చెందిన తస్మాన్ బేగంకురూ. 32 వేలు, కుర్వ హన్మంతుకు రూ.58 వేలు, చంద్రమోళ కిష్టప్పకు రూ. 60 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగప్ప నాంచార హన్మంతుడు, నరసింహులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply