US Iran Talks 2026 : రాజీతంత్రం !? Andhra Prabha Latest NewsA

US Iran Talks 2026 : రాజీతంత్రం !? Andhra Prabha Latest News
- అటు చర్చలు.. \
- ఇటు సైనిక దూకుడు
- ట్రంప్ స్వరం మారిందా?
- ‘రాజీ దారి’కి మలుపు
- 82వ ఎయిర్‌బోర్న్ రెడీ
- 18 గంటల్లోనే సర్వం సిద్ధం
- జెడి వాన్స్ కీలక పాత్ర
- ఇరాన్ దృష్టిలో ఇది అమెరికా ట్రాప్ ?
( ఆంధ్రప్రభ, న్యూయార్క్ ప్రతినిధి)

2026 మార్చి 1న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజయ దర్ఫణం అంతా ఇంతా కాదు. ఇక తదుపరి .. అదే వాట్ నెక్ట్స్ ,, క్యూబా అని గర్జించాడు. ఇరాన్ బేషరతుగా ప్రణమిల్లాలని హెచ్చరించారు. ఇక ఇజ్రాయెల్ జతగా చేనట్టిన ఆపరేసన్ ఎథిక్ ప్యూరీ కాస్తా.. ఆపరేషన్ ఎథిక్ పూర్.. గా మారిపోయింది. 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. తాజాగా.. అమెరికా అధ్యక్షుడి స్వరం మారింది. రాజీతంత్రం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెబుతున్నప్పటికీ, తన సైనిక బలాన్ని పెంచుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది.
US Iran Talks 2026 : యమ స్పీడుగా.. రెడీ యూనిట్

అమెరికా ఆర్మీకి చెందిన అత్యంత శక్తివంత 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుంచి సుమారు 1,000 మంది సైనికులు రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యానికి తరలివెళ్లనున్నారని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. ఈ బృందంలో ఒక బెటాలియన్ , డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ బ్రాండన్ టెగ్‌మెయర్ సహా కీలక సిబ్బంది ఉంటారు. వీరిని “రెడీ యూనిట్”గా పిలుస్తారు, అంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే కేవలం 18 గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగడానికి వీరు సిద్ధంగా ఉంటారు.
US Iran Talks 2026 : అటు చర్చ.. ఇటు దూకుడు

ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడానికి వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో చర్చలకు నాయకత్వం వహిస్తున్నారని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. అయితే, పరిస్థితిని అదుపులో ఉంచుకోవడానికి తమ ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఈ అదనపు దళాలను పంపుతున్నారు. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో వేలాది మంది మెరైన్ దళాలు మోహరించి ఉండగా, ఇప్పుడు పారాట్రూపర్ల రాకతో అమెరికా సైనిక శక్తి మరింత పెరగనుంది.
US Iran Talks 2026 : స్థానికంగా.. ఉద్రిక్తం

మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ దళాల మోహరింపు ప్రాంతీయ భద్రతపై మిశ్రమ ప్రభావాలను చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో దీనివల్ల కలిగే ప్రధాన పరిణామాలు ఇక్కడ ఉన్నాయి: ఈ దళాలు కేవలం 18 గంటల వ్యవధిలో ఎక్కడైనా రంగంలోకి దిగగలవు. ఇది అమెరికాకు ఆ ప్రాంతంలో తక్షణమే స్పందించే శక్తిని ఇస్తుంది, తద్వారా శత్రువుల నుంచి వచ్చే ఆకస్మిక దాడులను అడ్డుకోవడానికి (Deterrence) సహాయపడుతుంది.
US Iran Talks 2026 : రాజీ జస్ట్ ట్రంప్ ట్రాప్

ఒకవైపు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌తో శాంతి చర్చల గురించి మాట్లాడుతుండగా, మరోవైపు సైన్యాన్ని పంపడం వల్ల ఇరాన్ ఈ చర్చలను ఒక “ట్రాప్” (కుట్ర)గా భావించే ప్రమాదం ఉంది. ఇది దౌత్యపర ప్రయత్నాలకు ఆటంకం కలిగించవచ్చు. అమెరికా సైనిక శక్తి పెరగడం వల్ల ఇరాన్ కూడా తన క్షిపణి డ్రోన్ దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వంటి కీలక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి, ఇవి ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ఈ దళాలను పంపడం ద్వారా అమెరికా తన మిత్రదేశాలకు (ఉదాహరణకు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా) తన సొంత స్థావరాలకు అదనపు భద్రతను కల్పించాలనుకుంటోంది. అమెరికా యొక్క సైనిక పట్టును బలపరిచినప్పటికీ, ప్రాంతీయంగా యుద్ధ వాతావరణాన్ని మరింత వేడిక్కించే అవకాశం ఉంది.
ALSO READ : Uk Enters : అణుజగడం షురూ.. Andhra Prabha Latest News
