Us 10k Troops : అటు ఇటు Andhra Prabha Analysis

Us 10k Troops : అటు ఇటు Andhra Prabha Analysis

  • ట్రంప్ ద్వంద్వ వ్యూహం
  • ఇటు శాంతి వచనం
  • అటు బలగం సన్నద్ధం
  • మధ్య ప్రాచ్యం గందరగోళం

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

Us 10k Troops

ఇటు ఇరాన్‌తో శాంతి చర్చలను వల్లిస్తూనే.. మరో వైపు భారీ సంఖ్యలో సైనిక బలగాలను పశ్చిమ ఆసియాకు తరలిస్తూ.. అమెరికా అధ్యక్షుడు తప యుద్ధ రీతిని ప్రదర్శిస్తుంటే.. ఇరాన్​ మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ఫలితంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందా? అని అంతర్మధనంతో తల్లడిల్లిపోతున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్​ తో శాంతి చర్చల్లో పాల్గొంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నప్పటికీ, మరో దారిలో సైనిక మోహరింపు యత్నంపై సాక్షాత్తు అమెరికా జనం వ్యతిరేకింటం గమనార్హం.

Us 10k Troops : వాయిదాల ఊరింత

Us 10k Troops

10 రోజుల పాటు ఇరాన్‌పై సైనిక దాడులను (ఏప్రిల్ 6, 2026 వరకు) వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇరాన్ అభ్యర్థన మేరకు శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. హోర్ముజ్​ జలసంధిని తెరవక పోతే ఇరాన్ ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని ఆయన ప్రకటించారు.

Us 10k Troops

వెంటనే.. తన మాటను మార్చారు. విద్యుత్ ప్లాంట్లపై అమెరికా దాడులను ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 8 గంటల (Eastern Time) వరకు నిలిపివేసినట్టు ప్రకటించారు . ఇరాన్ ప్రభుత్వం స్వయంగా ఈ సమయాన్ని కోరిందని, ప్రస్తుతం చర్చలు చాలా సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు.
నిజానికి ఇరాన్ 7 రోజుల గడువు కోరగా, తానే స్వయంగా 10 రోజుల సమయం ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు.

Us 10k Troops

ఇరాన్ 8 చమురు ట్యాంకర్లను హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్ళేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్​ సమాచారం. దాడులు వాయిదా వేసినప్పటికీ, పశ్చిమ ఆసియాలో అమెరికా తన పట్టును బిగిస్తోంది. ట్రంప్‌కు మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచడానికి పెంటగాన్ సుమారు 10,000 మంది అదనపు సైనికులను ఆ ప్రాంతానికి పంపే యోచనలో ఉంది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి, ఇది ప్రపంచ దేశాలకు కొంత ఉపశమనం కలిగించింది.

Us 10k Troops : బలగాల సన్నద్ధం

Us 10k Troops

పశ్చిమ ఆసియాకు అదనంగా 10,000 మంది సైనికులను పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోందని శుక్రవారం (మార్చి 27) అమెరికా మీడియా నివేదించింది. పశ్చిమ ఆసియా (Middle East)లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా అదనంగా 10,000 మంది సైనికులను పంపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మార్చి 27, 2026 నాటి అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

Us 10k Troops

దాదాపు 10,000 మంది అదనపు పదాతిదళం (Infantry) సాయుధ విభాగాలను (Armored units) పశ్చిమ ఆసియాకు పంపాలని పెంటగాన్ యోచిస్తోంది.ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలను (Military options) అందుబాటులో ఉంచడమే దీని ఉద్దేశ్యం. ఇప్పటికే ఈ ప్రాంతంలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. కొత్తగా పంపే బలగాలు వీరికి అదనంగా చేరతాయి.

Us 10k Troops : 5000 మంది మెరైన్​ పటాలం

Us 10k Troops

ఇప్పటికే సుమారు 1,000 నుంచి 3,000 మంది ఎలైట్ సైనికులను (82nd Airborne Division) పంపే ప్రక్రియ ప్రారంభమైందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక దాదాపు 5,000 మంది మెరైన్ సైనికులు కూడా ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రణాళికాబద్ధ మోహరింపును ధృవీకరించిన ఇద్దరు రక్షణ అధికారుల ప్రకారం, దేశంలోకి సైనికులను పంపడంపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.

Us 10k Troops

కానీ, ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా ఈ యుద్ధంలో ఈ సైనిక సమీకరణ ఒక తీవ్రతర ఉధృతిని సూచిస్తుంది. ఫిబ్రవరి 28న ఆపరేషన్​ ఎథిక్స్​ ఫ్యూరీ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ లోని క్షిపణి దాడులు “9,000కు పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశాయని” యూ.ఎస్. సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళం, రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని లక్ష్యంగా ధ్వసం చేసినట్టు సైనిక అధికారులు తెలిపారు.

Us 10k Troops : ఇప్పటికి 50000 మంది సిద్ధం

Us 10k Troops

మధ్యప్రాచ్యంలో ఇప్పటికే 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఈ బలవంతంగా జలసంధిని స్వాధీనం చేసుకోవడం వంటి మరిన్ని చర్యలకు అవకాశం ఉందని ఈ బలం సరిపోతుందని అమెరికా భావిస్తోంది.

Us 10k Troops

ఈ మోహరింపు ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందనే దానిపై పెంటగాన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇరాన్ నుంచి 90 శాతం చమురు ఎగుమతులకు కీలక కేంద్రం ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవటం ట్రంప్ ప్రభుత్వం లక్ష్యం. ఆదేశాలు అందిన 18 గంటల్లోపే మోహరించగల 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్, పారాచూట్ దాడులు చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. అందుకే ఈ బలగాలను మోహరింపు సాగుతోంది.

Us 10k Troops : ఇరాన్​ ససేమిరా

Us 10k Troops

మరోవైపు, ఇరాన్ మాత్రం తాము అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని, అమెరికా ప్రకటనలు కేవలం చమురు మార్కెట్లను ప్రభావితం చేసేందుకేనని కొట్టిపారేసింది. గల్ఫ్​ ప్రాంతంలో అమెరికా సైనికులు బస చేస్తున్న హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. “అమెరికన్ దళాలన్నీ ఒక హోటల్‌లోకి వెళ్లినప్పుడు, ఆ హోటల్ అమెరికన్ హోటల్‌గా మారిపోతుంది,” అని సాయుధ దళాల ప్రతినిధి అబోల్ఫజల్ షెకార్చి స్పష్టం చేశారు.

Us 10k Troops

“అమెరికన్లు మనపై దాడి చేస్తుండగా మనం చూస్తూ ఊరుకోవాలా? మనం ప్రతిస్పందించినప్పుడు, సహజంగానే అమెరికన్లు ఎక్కడ ఉన్నా దాడి చేయకతప్పదు, అని ఆయన అన్నారు. గల్ఫ్‌లో ఇరాన్ తన దాడులను ఆపలేదు. శుక్రవారం (మార్చి 27, 2026) జరిగిన డ్రోన్ దాడిలో కువైట్ ప్రధాన వాణిజ్య ఓడరేవు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. “తెల్లవారుజామున డ్రోన్‌లతో షువైఖ్ ఓడరేవు లక్ష్యంగా దాడి జరిగింది, ప్రాథమిక నివేదికల ప్రకారం ఆస్తి నష్టం జరిగింది కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు” అని కువైట్ పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Us 10k Troops : జనం వ్యతిరేకం

ఈ యుద్ధానికి అమెరికా ప్రజల మద్దతు క్రమంగా తగ్గుతోందని, అమెరికా దాడులను 35 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఆమోదిస్తున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్​ తెలిసింది. గత వారం జరిగిన పోల్‌లో 37 శాతం మంది అమెరికన్లు యుద్ధానికి మద్దతు తెలిపారు. , 61 శాతం మంది ఈ దాడులను వ్యతిరేకించారు.

Leave a Reply