UPSC Civils | ఫలితాలు విడుదల..

UPSC Civils | ఫలితాలు విడుదల..
UPSC Civils | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యూపీఎస్సీ సివిల్ (UPSC Civils) సర్వీసెస్ పరీక్ష 2025 ఫైనల్ ఫలితాలు (Results) విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా యువతలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి. అనూజ్ అగ్నిహోత్రి (Anuj Agnihotri) మొదటి ర్యాంకుతో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. రాజేశ్వరి సువే రెండో ర్యాంకుతో రెండో స్థానాన్ని సాధించారు. ఈ ఏడాది ఫలితాలు యువతకు మరింత ప్రేరణనిచ్చేలా ఉన్నాయి.
ఈ సంవత్సరం సివిల్స్ ఫైనల్ లిస్ట్ (Civil Services Final List) లో అత్యధిక మహిళలు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అభ్యర్థులు, రాష్ట్రాల నుంచి విభిన్న నేపథ్యాల వారు ఎంపిక కావడం విశేషం. అనూజ్ అగ్నిహోత్రి, రాజేశ్వరి సువే వంటి టాపర్లు తమ కష్టం, నిష్ఠతో లక్షలాది మంది యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ ఫలితాలు కేవలం ర్యాంకులు మాత్రమే కాదు – కష్టపడి కలలను సాకారం చేసుకునే యువతకు ఒక బలమైన సందేశంగా మారాయి.
