Up to Rs.10/- | గుడ్డు రేటు..వర్రీ గురూ
కొండపై కోడి కూత
జనానికి చుక్కలు
తగ్గిన ఉత్పత్తి ..
పెరిగిన డిమాండు
పైగా పండగ సీజన్
బేకరీల్లో గుడ్డు గోల
బడి పిల్లలకు నో ఎగ్
రిటైల్ షాపుల్లో.. గుడ్డు ₹ 10
Up to Rs.10/- ఆంధ్రప్రభ, ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఏపీ, తెలంగాణలో కోడిగుడ్డు ధర కొండెక్కి కూస్తోంది. గడచిన వారం రోజుల్లోనే హోల్ సేల్ మార్కెట్టులోనే డజను గుడ్ల ధర ₹ 80 నుంచి ₹ 96కు చేరింది. రిటైల్ మార్కెట్ లో ₹ 10లకు చేరింది. అంతకుముందు ₹6 లకు దొరికిన గుడ్డు ప్రస్తుతం ₹ 7 నుంచి ₹ 10లకు ఎగబాకింది.
ఈ ధరలతో (Egg Worry) వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కోడిగుడ్డు కొనాలన్నా.. తినాలన్నా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మారెట్లో డిమాండ్‌కు తగ్గట్లు కోడిగుడ్ల సరఫరా లేకపోవడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ తగ్గినా.. కోడి గుడ్ల ( Raise Egg Rate) ధరలు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం బహిరంగ మారెట్లో కిలో చికెన్‌కు ₹ 20 నుంచి ₹ 40 వరకు తగ్గింది.
Up to Rs.10/- ఉత్పత్తి ఢమాల్..
మార్కెట్ డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి (Production) లేకపోవడంతో ధర పెరుగుతోందని నెక్ (NECC) వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా (In Winter)శీతాకాలం గుడ్ల ఉత్పత్తి (Decrease )తగ్గుతుంది. ఏపీలో రోజుకు 7. 5 కోట్లు, తెలంగాణలో 5,3 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుంది.
ఈ రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే గుడ్లలో దాదాపు 40 నుంచి -50% మహారాష్ట్ర, (Maha Rashtra) ఉత్తరప్రదేశ్, (UP) పశ్చిమ బెంగాల్ (WB) తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ఏపీలో రోజుకు సుమారు 2.8 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు, తెలంగాణలో సుమారు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల గుడ్లు, కేవలం హైదరాబాద్ నగరంలోనే ప్రతిరోజూ దాదాపు 75 లక్షల నుంచి 80 లక్షల గుడ్ల (Egg Consumption) వినియోగం జరుగుతోంది.
కానీ 3 నెలల కిందట బర్డ్ ఫ్లూ (Bird Flu) తో గుడ్లుపెట్టే కోళ్లు గణనీయంగా తగ్గాయి. గుడ్ల ఉత్పత్తీ (15 నుంచి 20 % పడిపోయింది. ఫారాల్లో పిల్లలు పెరిగి గుడ్లు పెట్టే దశకు రావాలంటే 3 నెలలు పడుతుంది. అందువల్ల రెండు నెలల నుంచి (From Two Months) బాగా ఉత్పత్తి తగ్గింది. ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు 2.5 కోట్ల గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. 11 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుంటే.. మరోవైపు 6.5 కోట్ల గుడ్లు ఎగుమతి ఆగలేదు. అంటే 4.5 కోట్ల గుడ్లే అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు 5.5 కోట్ల గుడ్లు నిత్యవసరం కాగా.. ప్రస్తుతం రోజుకు కోటి గుడ్లు కొరత (Scarcity) ఏర్పడిందని (1 Crore eggs) అంచనా. జనవరి మూడో వారం తర్వాత గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని, అప్పటివరకూ ధరలు ఎక్కువగానే ఉంటాయని రైతులు అంటున్నారు. గత నెలల ఒక్కో గుడ్డు ధర రూ.6 ఉండగా, వారం క్రితం రూ.7కు చేరుకుంది. తాజాగా గుడ్డు ధర రూ.9 కి పెరిగింది. కేవలం వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా రూ.72 నుంచి రూ.108 కు చేరుకుంది. హౌల్‌సేల్‌లో
Up to Rs.10/- పెరుగుదలకు కారణాలివే
ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో కోడి గుడ్ల ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు, చెబుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత (Cold Wave) పెరగింది.ఈ రోజుల్లోనే ఉత్తర భారతంలో కోడి గుడ్లకు డిమాండ్ (Demond in North) విపరీతంగా పెరుగుతుంది. ప్రోటీన్ ఆహారం కోసం చాలా మంది గుడ్లు తింటారు.
దాంతో పాటుగా.. డిసెంబర్ 25 క్రిస్మస్ (Xmus), జనవరి 1 న్యూ ఇయర్ (New Year) వేడుకలు ఉండటంతో కేకులకు డిమాండ్ పెరుగుతుంది. కేకుల్లో వినియోగించేందుకు బేకరీ (Bakery) వ్యాపారులు బల్క్‌లో కోడి గుడ్లను కోనుగోలు చేస్తారు. మార్కెట్‌కు గుడ్ల సరఫరా (Supply Decrease) తగ్గిపోయింది. ధర అమాంతం పెరిగింది. జనవరి చివరి వారం, ఫిబ్రవరి కల్లా ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని వ్యాపారులు వెల్లడించారు.
Up to Rs.10/- బడి పిల్లలకు గుడ్లు లేవు

ఏపీ, తెలంగాణలో ఏపీ, తెలంగాణలో మధ్యాహ్న భోజనం (Mid Day Meal) అమలు జరుగుతోంది. ఏపీలో డొక్కు సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం, తెలంగాణలో సీఎం పోషణ్ పేరిట ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి.
ఏపీలో ప్రతి విద్యార్థికి రోజుకు ఒక కోడిగుడ్డు చొప్పున వారానికి 5 రోజులు (సోమవారం నుండి శుక్రవారం వరకు) అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 లక్షల మందికి పైగా పాఠశాల విద్యార్థులు . 1.48 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ పథకంలో ప్రయోజనం పొందుతున్నారు. ఈ ప్రకారం రోజుకు సుమారు 37 లక్షలకు (37 Lakh Eggs) పైగా కోడిగుడ్లు అవసరం.
ఇక తెలంగాణలో సుమారు 25 లక్షల నుండి 30 లక్షల మంది విద్యార్థులకు (1వ తరగతి నుండి 10వ తరగతి వరకు) మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతోంది. సోమ, బుధ, శని వారాల్లో స్రతి రోజు 28 లక్షల కోడిగుడ్లు అవసరం. అంటే రెండు రాష్ట్రాల్లో 65 లక్షల (65 Lakh Eggs) కోడి గుడ్లు అవసరం కాగా.. బహిరంగ మార్కెట్ లో కోడిగుడ్ల డిమాండు పెరగటంతో.. ప్రభుత్వ పాఠశాలలకు గుడ్లు సరఫరాకు ఆటకం ఏర్పడింది. గత వారం రోజులుగా నే కాదు.. ఈ మధ్య కాలంలో మధ్యాహ్న భోజన పథకంలో కోడిగడ్లు వడ్డించటం లేదు.
ఇటీవల బాపట్ల ఎమ్మెల్యే వర్మ స్టువర్టుపురంలోని గిరిజన గురుకుల పాఠశాలకు వెళ్లి తనిఖీ చేయగా.. కోడిగుడ్లు పెట్టట్లేదని విద్యార్థులు తెలిపారు. అంటే.. సర్కారీ స్కూళ్లకు గుడ్డు సరఫరా తగ్గిందని తెలుస్తోంది. ప్రస్తుతం గుడ్డు రేటు పెరగటంతో.. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెట్టలేని స్థితి ఏర్సడిందని జనం అభిప్రాయపడుతున్నారు. అంటే బడిపిల్లలకు కోడి గుడ్డు దూరమైనట్టే.
Up to Rs.10/- నష్టాల బాటలో కోళ్ళ పరిశ్రమ
రెండేళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ (poultry Industry) నష్టాల్లో ఉండటంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. దీంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. జనవరి 1, క్రిస్మస్ నేపథ్యంలో కేకుల తయారీకి వినియోగించడం, . తమకు హౌల్‌సేల్ రూ.5లు మాత్రమేనని చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు
పౌల్ట్రీ పరిశ్రమ నాలుగేళ్లుగా (In Loss) నష్టాల్లో ఉంది. గత నెలలోనూ కోడి గుడ్డు హౌల్‌సేల్ కేవలం రూ.5మాత్రమే. అయితే ప్రస్తుతం పెరుగుదుల ఊరటనివ్వగా కొనుగోలుదారులకు మాత్రం చుక్కలు కన్పిస్తున్నాయి. కనీసం రూ.6.00 రైతులకు లభిస్తే నష్టాల నుంచి కొంతమేర కోలుకోగలమని రైతులు చెబుతున్నారు. గుడ్డు ఉత్పత్తికి రూ.5.50 వెచ్చిస్తున్నట్టు వివరించారు.
Up to Rs.10/- పెరిగిన దాణా ఖర్చు

కోళ్లకు వినియోగించే మేత, దాణా (Feed Expendeture) ఖర్చులు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. మ్నొక్కజొన్న, సోయా దాణాను అధికంగా వాడుతుంటారు. మొక్కజొన్న (Maize) దాణా టన్నుకు ఏడాదిలో రూ.18 వేల నుంచి రూ.25 వేలు, సోయా (Soya) రూ.50 వేల నుంచి రూ.80 వేలకు పెరిగింది. దీంతో దాణా ఖర్చు రెట్టింపైంది.
అదే స్థాయిలో ధర పెరగకపోవడంతో నష్టాలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. 2019కి పూర్వం దాణా రేటు తక్కువగా ఉండటంతో ఖర్చు తగ్గి రైతులు లాభాలు పొందారు. గడిచిన నాలుగేళ్లలో దాణా, ఇతర ఖర్చులు రెండింతలు పెరగడంతో నష్టాలు చవిచూస్తున్నారు.
మరోవైపు గుడ్డు ఎగుమతులు జరిగే ఈశాన్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, యూపీ, కోల్కత్తా వంటి రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. సబ్సిడీలు, రాయితీలు కల్పిస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు స్థానిక మార్కెట్‌పైనే ఆధార పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గత రెండేళ్ల నుంచి కోళ్ల ఫారాల్లో నష్టాల కారణంగా కొత్త బ్యాచ్‌లు వేయడం లేదు. పాతకోళ్లతోనే నడుస్తున్నందున తాజాగా పెరుగుదలకు ఒక కారణమని తెలుస్తోంది..
click here to read RBI Injuction : 1.5 లక్షల కోట్ల లిక్విడిటీ

