UP | మధురలో ఘోర రోడ్డు ప్రమాదం..

UP | మధురలో ఘోర రోడ్డు ప్రమాదం..
UP, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మధుర జిల్లా మగోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగలా దేవియా ప్రాంతంలో కారు కాలువలోకి దూసుకెళ్లింది. వివాహ వేడుకలో పాల్గొనేందుకు కారులో వెళ్తుండగా మలుపు వద్ద వాహనం అదుపుతప్పి కాలువలోపడింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. మృతులు యూపీకి చెందినవారిగా గుర్తించారు. నలుగురు యువకుల్లో ఇద్దరు లా చదువుతున్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కారును కాలువ నుండి బయటకు తీసి దర్యాప్తు ప్రారంభించారు.
