bjp| హామీలిస్తున్నారు.. మర్చిపోతున్నారు

bjp| హామీలిస్తున్నారు.. మర్చిపోతున్నారు
రైతులకు వెంటనే పెట్టబడి సాయం ఇవ్వాలి
లేదంటే ఆందోళనలు చేపడతాం..
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రైతుభరోసా ఇవ్వకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండి పడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతుభరోసా ఇస్తామని ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు వేశామని 9 నెలలుగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు హామీలిస్తున్నారు..ఆ తర్వాత మర్చిపోతున్నారని ఆరోపించారు. 67 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నా.. ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. తక్షణమే రెండు విడతల రైతుభరోసా సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతుభరోసా ఇవ్వకుంటే ఆందోళనలు చేపడతామని బండి సంజయ్ లేఖలో హెచ్చరించారు.
