Union Budget | దేశ భవిష్యత్‌కు ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ – చంద్రబాబు
వెలగపూడి | వికసిత్ భారత్ విజన్‌ను ప్రతిబింభించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ప్రశంసించారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళా, పేదల, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26పై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారని ర్కొన్నారు.
రానున్న ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శకతం చేస్తోందన్నారు చంద్రబాబు. జాతీయ సౌభాగ్యానికి ఈ బడ్జెట్ ఓ ముందడుగు అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌కు ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ లాంటిదన్నారాయన. మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్, ఈ బడ్జెట్‌లో వచ్చిన అదనపు ప్రయోజనం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.