యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో విఎంసి ప్రథమ స్థానం

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో విఎంసి ప్రథమ స్థానం

స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ డైరెక్టర్ శివప్రసాద్

విజయవాడ, ఆంధ్రప్రభ : యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లో జిల్లాలోనే విఎంసి ప్రథమ స్థానంలో ఉన్నందుకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ డైరెక్టర్ శివ ప్రసాద్ విజయవాడ నగర పాలక సంస్థను అభినందించారు. ఆదివారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కె. షమ్మీ ఆధ్వర్యంలో పటమటలో తానే స్వయంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేశారు.

ఈ సందర్భంగా స్వర్ణ గ్రామం స్వర్ణ అవార్డ్ డైరెక్టర్ శివ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం తీసుకొచ్చిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఎంతో ముఖ్యమైన సర్వే అని, ఇటు వంటి సర్వేలు ప్రభుత్వం ప్రజల వద్దకు తీసుకువస్తే ప్రజలు సచివాలయం కార్యదర్శులకు సహకరించి వివరాలను అందజేయాలని,

ఈ సర్వేలు కేవలం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే జరుగుతుందని, అందువలన ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించి ఈ సర్వేలను దిగ్విజయం చేయవలసిందిగా విన్నవించారు.ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాల నాయక్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply