గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ..

గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ..

నిజాంపేట, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన ఈ రోజు ఉదయం నిజాంపేట‌(Nizampet)లో చోటుచేసుకుంది. ఈ మేరకు స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. నిజాంపేటకు చెందిన కొమ్మట ఎల్లం(Kommata Ellam)(25) కూలి పని కొరకు మేడ్చల్‌(Medchal)లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

రోజు మాదిరిగానే ఈ రోజు పనికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో(with a collision) తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు(Police) కేసు నమోదు చేసి నిజాంపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.

Leave a Reply