వికారాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రప్రభ): వికారాబాద్-చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ల మధ్య దాదాపు గుర్తు తెలియని వ్యక్తి (30) రైలు కిందపడి మరణించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్-చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ మధ్య 30 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తిని గుర్తించినట్టు పేర్కొన్నారు. మృతుని శరీరంపై నీలిరంగు షర్ట్ తో పాటు ప్యాంట్ ధరించి ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ఆ మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఆయన పేర్కొన్నారు.
Vikarabad | రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
