Unguturu | గ్రామ సర్పంచ్ మృతి

Unguturu | గ్రామ సర్పంచ్ మృతి

Unguturu | ఉంగుటూరు, ఆంధ్రప్రభ : ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామ సర్పంచ్ లాం దెబోరా ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఆమె మృతి పట్ల పంచాయతీ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె సేవలను స్మరించుకుంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి కలగాలని ప్రార్థించారు. పలువురు ప్రముఖులు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Leave a Reply