cricket | మినీ సమరం..

మినీ సమరం..
- నేటి నుంచి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్-2026
- ఇవాళ భారత్- యూఎస్ఏ మ్యాచ్
- భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం
- బులవాయోలోని క్వీన్స్ క్లబ్ వేదికగా మ్యాచ్
cricket | వెబ్‌డెస్క్ (స్పోర్ట్స్), ఆంధ్రప్రభ : నేటి నుంచి (జనవరి 15) అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్-2026 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు పోటీపడుతున్నాయి. మొదటి మ్యాచ్ భారత్-యూఎస్ఏ మధ్య జరగనుంది. ఆస్ట్రేలియా డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. మొత్తం 41 మ్యాచ్లు జరుగనున్నాయి. 16 జట్లు 4 గ్రూప్ లుగా (గ్రూప్కు 4) విభజించబడి పోటీపడతాయి. అనంతరం సూపర్-6, సెమీస్, ఫైనల్ జరుగుతాయి. భారత్ మొత్తం ఐదు సార్లు ఈ టైటిల్ గెలిచింది. గత ఎడిషన్ (2024) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్‌కు ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు.
ఎక్కడ చూడొచ్చంటే..?
ఈ మెగా టోర్నీ భారత అభిమానుల కోసం JioHotstar యాప్, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇవాళ జరిగే భారత్- యూఎస్ఏ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది. బులవాయోలోని క్వీన్స్ క్లబ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
గ్రూప్ వివరాలు
గ్రూప్ A: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జపాన్
గ్రూప్ B: భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అమెరికా
గ్రూప్ C: జింబాబ్వే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్
గ్రూప్ D: వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, టాంజానియా
