Uk Enters : అణుజగడం షురూ.. Andhra Prabha Latest News

Uk Enters : అణుజగడం షురూ.. Andhra Prabha Latest News
ఇక బ్రిటన్ సైతం…
రంగంలోకి..HMS ఆన్సన్
- ఇగ్లాండ్ బలప్రదర్శన
- అమెరికా-బ్రిటన్ జాయింట్ ఆపరేషన్
- భారత్ వ్యూహాత్మక ఆందోళన
( ఆంధ్రప్రభ, న్యూయార్క్ ప్రతినిధి)

ఇరాన్.. ఇజ్రాయెల్ మధ్య పేచీలో అమెరికా తలదూర్చి.. హర్ముజ్ జలసంధి చిచ్చును కాస్త ప్రపంచ అణ్వాయుధ జడగంగా మార్చేసింది.

ఇరాన్ లోని నతాంజ్ (Natanz) అణుశుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దళాలు జాయింట్ ఆపరేఫన్ పేరుతో భారీ వైమానిక దాడి జరిపిన కొన్ని గంటల్లోనే. ఇరాన్ ప్రతిదాడితో సమాధానం చెప్పింది. ఇజ్రయెల్ అణుధార్మిక కేంద్రం డిమోనాపై క్షిపణులతో విరుచుకు పడింది. ఈ సంగతి ఇలా ఉంటే.. గత శుక్రకారం ఇరాన్ తన ఆముధ బలాన్ని పదర్శించింది. హిందూ మహాసముద్రంలో అమెరికా, బ్రిటన్ దేశాల అత్యంత వ్యూహాత్మక డియాగో గార్సియా (Diego Garcia) సైనిక స్థావరంపై ఇరాన్ తన క్షిపణులను ఎక్కు పెట్టింది.

ఈ దాడిలో ఈ స్థావరం తృటిలో తప్పించుకుంది. లేకుండా పెద్ద అణు విస్పోటనం ఎలా ఉంటే.. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ రుచి చూసేవి. నిన్నా మొన్నటి వరకూ హర్ముజ్ జలసంధి కోసం ఇరాన్ తో యుద్ధం చేద్దామని అమెరికా ఎంత మొర పెట్టుకున్నా.. పట్టించుకోని బ్రిటన్ ఆలస్యంగా కళ్లు తెరిచింది .

డియాగో గార్సియాపై దాడిలో ఓ క్షిపణి లక్ష్యాన్ని చేరలేదు. రెండవ క్షిపణిని అమెరికా దళాలు కూల్చివేశాయి. ఈ దెబ్బతో.. బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్న బ్రిటన్ తన దారిని మళ్లించింది. హౄర్ముజ్ జలజంధిని 48 గంటల్లో తెరవకపోతే.. ఇరాన్ అణుకేంద్రాలన్నింటినీ ధ్వంస చేస్తానని ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డెడ్ లైన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగవచ్చనే అంచనాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, అణుశక్తితో నడిచే బ్రిటిష్ జలాంతర్గామి HMS ఆన్సన్ అరేబియా సముద్రానికి చేరుకుందని అంతర్జాతీయ మీడియా అలెర్ట్ చేసింది. నిజానికి ఈ నౌక మార్చి 6న పెర్త్ నుంచి బయలుదేరింది, ప్రస్తుతం హర్ముజ్ జలసంధి సమీపంలోని ఉత్తర అరేబియా సముద్రంలో మోహరించినట్టు సమాచారం.
Uk Enters : ఇది బ్రిటన్ బాహుబలి

HMS ఆన్సన్ ఇది అణు ధార్మిక బ్రిటన్ జలంతర్గామి. 1,600 కిలోమీటర్ల లక్ష్య పరిధి కలిగిన టోమాహాక్ బ్లాక్ IV భూతల దాడి క్షిపణులు, స్పియర్‌ఫిష్ భారీ టార్పెడోలు ఈ పౌక పొంతం.. ఇరాన్ లక్ష్యాలపై దాడుల కోసం బ్రిటిష్ సైనిక స్థావరాలను అమెరికా వాడుకోవచ్చు. ఇందుకు అనుమతి ఇచ్చేందుకు యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అంగీకరించారు. సరీగా ఇదే తరుణంలో HMS ఆన్సన్ అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది.
Uk Enters : అసలు ఏమి జరిగింది?

హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ కు అత్యంత వ్యూహాత్మక డియాగో గార్సియా (Diego Garcia) సైనిక స్థావరంపై 2026 మార్చి 21న ఇరాన్ క్షిపణి దాడి విఫలమైంది. ఇరాన్ రెండు మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను (Intermediate-Range Ballistic Missiles) ప్రయోగించింది. ఒక క్షిపణి గాలిలోనే విఫలం కాగా, రెండో క్షిపణిని అమెరికా నౌకాదళం (US Navy) అడ్డుకుంది. స్థావరానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇరాన్ తీరం నుండి డియాగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రిటీష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడుల కోసం అమెరికాకు తమ సైనిక స్థావరాలను (డియాగో గార్సియాతో సహా) ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వటంతో ఇనాన్ ఈ దాడికి దిగింది.
Uk Enters : ఇరాన్ కు ఇంత శక్తి ఉందా?

ఈ దాడి ప్రయత్నంతో ఇరాన్ క్షిపణి శక్తిపై కొత్త చర్చకు దారితీసింది:
ఇరాన్ తన క్షిపణుల గరిష్ట పరిధి 2,000 కి.మీ అని గతంలో ప్రకటించింది. అయితే, 4,000 కి.మీ దూరంలోని డియాగో గార్సియాను లక్ష్యం చేసుకోవడం ద్వారా ఇరాన్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని భావించింది. ఒకవేళ ఇరాన్ క్షిపణులు 4,000 కి.మీ ప్రయాణించగలిగితే, లండన్, పారిస్ వంటి ప్రధాన యూరోపియన్ నగరాలు కూడా వాటి పరిధిలోకి వస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Uk Enters :ఇరాన్ హై టెక్నాలజీ

ఇరాన్ ప్రస్తుతం మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద క్షిపణి వ్యవస్థను (Arsenal) కలిగి ఉంది. ఖైబర్ క్షిపణి, ఇది ఇరాన్ అత్యంత అధునాతన క్షిపణి. దీని పరిధి సుమారు 2,000 కి.మీ అని అధికారికంగా చెప్పినప్పటికీ, తాజా ప్రయోగాలతో ఇది మరింత దూరం ప్రయాణించగలదని (సుమారు 4,000 కి.మీ వరకు) నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది 1,500 కిలోల బరువున్న వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు.
ఇక సెజ్జిల్ (Sejjil) . ఇది ఘన ఇంధనంతో (Solid-fuel) నడిచే రెండంచెల క్షిపణి. వేగంగా దూసుకుపోగలదు. శత్రువుల రాడార్లకు దొరకడం కష్టం. షహాబ్-3 (Shahab-3): ఇది ఇరాన్ క్షిపణి వ్యవస్థకు వెన్నెముక. ఇది సుమారు 2,000 కి.మీ పరిధిని కలిగి ఉంది. ఇక హైపర్ సోనిక్ సామర్థ్యం: ఇరాన్ తన ‘ఫతా’ (Fattah) అనే హైపర్ సోనిక్ క్షిపణి ఉందని క్లెయిమ్ చేస్తోంది. ఇది శబ్ద వేగం కంటే 15 రెట్లు వేగంతో ప్రయాణించి, క్షిపణి రక్షణ వ్యవస్థలను (Missile Defense Systems) ఛేదించగలదు.
Uk Enters : ఇరకాటంలో భారతం

హిందూ మహాసముద్రంలో జరిగిన ఈ దాడి భారత్‌కు వ్యూహాత్మకంగా ఆర్థికంగా ఆందోళన కలిగించే అంశం . డియాగో గార్సియా భారతదేశానికి సమీపంలో ఉంటుంది. ఇరాన్ క్షిపణుల పరిధి 4,000 కి.మీకి చేరిందంటే, దాదాపు మొత్తం భారతదేశం ఇరాన్ క్షిపణుల పరిధిలోకి వచ్చినట్లే. ఇది ప్రాంతీయ భద్రతపై ఒత్తిడిని పెంచుతుంది. హిందూ మహాసముద్రం ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు ఈ దాడులు ముప్పుగా పరిణమిస్తాయి. ముడి చమురు దిగుమతులు ఎగుమతులపై ప్రభావం పడి, పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగితే, భారత్‌కు అందే చమురు సరఫరాలో ఆటంకాలు కలగవచ్చు. అటు ఇరాన్‌తో, ఇటు అమెరికా/బ్రిటన్‌లతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే, భారత్ తటస్థంగా ఉండటం సవాలుగా మారుతుంది . ఇరాన్ తన క్షిపణుల పరిధిని రహస్యంగా పెంచుకుంటూ పోతోంది. డియాగో గార్సియాపై దాడి ప్రయత్నం ద్వారా, ఇరాన్ తన క్షిపణులు కేవలం ఇజ్రాయెల్ లేదా మధ్యప్రాచ్యంపైనే కాకుండా, హిందూ మహాసముద్రంలోని సుదూర లక్ష్యాలపై కూడా దాడి చేయగలవని నిరూపించడానికి ప్రయత్నించింది.
ALSO READ : 100 Injured : లిటిల్ ఇండియా జస్ట్ బేజార్ .. Andhra Prabha Latest News
