ugadi2026 | బాబుగారి కవిసమ్మేళనం-ఏపీ విజన్ సాక్షాత్కారం

ugadi2026 | బాబుగారి కవిసమ్మేళనం-ఏపీ విజన్ సాక్షాత్కారం
ugadi2026 | ముఖ్యమంత్రే కవి… ప్రత్యేక ఆకర్షణ
విజన్ కవితగా… అభివృద్ధి సందేశం
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలుగువారి సంవత్సరాది-ఉగాది. ఉగాది పండుగకి కవిసమ్మేళనాలు జరుపుకోవడం పండగశోభను మరింత ఇనుమడింపజేసే ఆనందోత్సవం. ఒక్కో కవి హృదయంలో పేరుకున్న భావాలన్నీ కవితల రూపంలో బయటికి తన్నుకొచ్చి, వారి భావాలన్నీ వెల్లువెత్తి…సభలోని వారందరి హృదయాలను భావావేశంలో ముంచెత్తుతాయి.

విభిన్నమైన ఆలోచన ఏమిటంటే, కవి సమ్మేళనంలో కవిత వినిపిస్తున్నది సాక్షాత్తూ ముఖ్యమంత్రే కావడం. బాబుగారే కవిత వినిపిస్తే, ఆయనలోని విజన్, దూరదృష్టి, అభివృద్ధి సంకల్పం అన్నీ ఒక్క కవిత రూపంలో వెల్లువై ప్రజలను అలరించదా ఇక…ఏపీలో అభివృద్ధి, పోలవరం, తదితర అంశాలన్నిటినీ ఒక్క కవితలో వినిపిస్తున్న ఈ కార్టూన్ ఆంధ్రప్రభ ప్రత్యేకం.
