Two Young Men | ఆ కుర్రాళ్లు పోలీసులయ్యారు

Two Young Men | ఆ కుర్రాళ్లు పోలీసులయ్యారు
- చినపాండ్రాక గ్రామస్తుల హర్షం
Two Young Men | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం చినపాండ్రాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పోలీస్ (Police) కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం వెల్లడించిన ఫలితాల్లో వీరు ఉత్తీర్ణత సాధించి నియామక పత్రాలు అందుకున్నారు. ఒకే గ్రామం నుంచి ఇద్దరు యువకులు ఖాకీ దుస్తులు ధరించనుండటంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరి విజయం గ్రామంలోని ఇతర యువతకు ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు కొనియాడారు.
