IND vs PAK | ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు… పాక్ 205/7 !

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆసక్తిగా సాగుతోంది. భారత్‌ పటిష్ట బౌలింగ్‌తో పాకిస్థాన్‌ అవ‌స్త‌లు ప‌డుతోంది. 35 ఓవర్లవ‌ర‌కు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్థాన్… 43 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయింది.

మిడిలార్డ‌ర్ లో ష‌కీల్ (62).. రిజ్వాన్ (46) ఔట‌న త‌రువాత వ‌చ్చిన బ్యాట‌ర్లు వ‌చ్చిన‌ట్టే పెవిలియ‌న్ చేరుతున్నారు. తాజాగా, కుల్దీప్ యాద‌వ్ వేసిన 43వ ఓవ‌ర్లో అఘా సల్మాన్ (5) – షాహీన్ అఫ్రిదీ (0) ఔట‌య్యారు.

పాక్ బ్యాట‌ర్లు షకీల్ (62), రిజ్వాన్ (46) ఔటైన త‌రువాత‌… క్రీజులోకి వ‌చ్చిన బ్యాటర్లు పెవిలియన్ క్యూ క‌డుతున్నారు. తాజాగా కుల్దీప్ యాదవ్ వేసిన 43వ ఓవర్లో అఘా సల్మాన్ (5) – షాహీన్ అఫ్రిది (0) ఔటయ్యారు.

కాగా, ప్ర‌స్తుతం క్రీజులో ఖుష్దిల్ షా (21) – నసీమ్ షా ఉన్నారు. 43 ఓవ‌ర్ల‌కు పాక్ స్కోర్ 205/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *