Two-wheeler |ద్విచక్ర వాహనంపై వెళ్తూ…

Two-wheeler | ద్విచక్ర వాహనంపై వెళ్తూ…

యువకుడు మృతి

Two-wheeler | రొంపిచర్ల, ఆంధ్రప్రభ : మండలంలో బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో ద్విచక్ర వాహనం మీద వెళ్తూ అదుపు తప్పి ‌యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పొలాలకు వెళ్ళిన గ్రామస్తులు రోడ్డు ప్రక్కన మృతదేహం పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పేరం మధు (35)గా గుర్తించారు. మృతుడు ద్విచక్ర వాహనం మీద వెళ్తూ దానిపై నుండి పడి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుని బంధువులకు సమాచారం అందించారు.

Leave a Reply