కుల్గాం : జమ్ముకశ్మీర్ (JammuKashmir) లో ఉగ్రవాదుల నిర్మూలన కోసం సాగుతున్నఆపరేషన్ అకాల్ (OperationAkal) నిరంతరంగా కొనసాగుతోంది. ఈ చర్యలో భాగంగా జరిగిన తాజా ఎన్‌కౌంటర్ (Encounter) లో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అదనంగా, మరో ఇద్దరు సైనికులు గాయపడగా, వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ అకాల్ తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంలో కుల్గాం (Kulgam) జిల్లాలో దాగి ఉన్న ఉగ్రవాదులను పట్టుకొని నిర్మూలించేందుకు భద్రతా బలగాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో, ఉగ్రవాదుల వైపు నుంచి జరిగిన దాడిలో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.