ఇంకో టూ డేస్ .. టెన్షన్ టెన్షన్
- పీఎస్‌యూలు కోలుకున్నా..
- హెచ్‌యూఎల్‌కు నీరసం
- ఐటీలో నిస్టేజం
- ఆర్బీఐ నిర్ణయం కోసం ఎదురు చూపులు
- అమెరికాతో ఇండియా డీల్ పైనే చర్చ
- ఫెస్టివల్ సీజన్ మందగమనం
హైదరాబాద్, ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : దలాల్ మార్కెట్(Dalal Market).. ఈ వారం తొలి రోజు కూడ క్షీణ దశనే ముటగట్టుకుంది. ఆటూ పోటును సరి సమానంగా భరించింది. మొత్తం మార్కెట్ అతి జాగ్రత్తగా వ్యవహరించింది. విదేశీ మదుపర్ల స్పందన, RBI పాలసీ మీటింగ్ ఫలితాలు, అమెరికా – ఇండియా(America – India) ట్రేడ్ సంబంధాలు, IIP పండుగ సీజన్ వ్యాపారంపైనే దృష్టి సారించాయి.
ఫలితంగా ఈ రోజు సెప్టెంబర్ 29, 2025న NSE & BSE మార్కెట్లలో మొత్తం సెన్సెక్స్(Sensex) 166 పాయింట్లు (-0.21%) తగ్గి 80,260.21 వద్ద ముగిసింది. 41 పాయింట్లు (-0.17%) తగ్గి నిఫ్టీ 24,613.50 వద్ద ముగిసింది. మార్కెట్‌లో RBI పాలసీ మీటింగ్, US టారిఫ్(Tariff) ఒత్తిడి వల్ల వోలటాలిటీ ఎక్కువగా ఉంది. కొన్నిషేర్లు(Shares) మాత్రం మంచి లాభాలు సాధించాయి.
NSE నిఫ్టీ 50లో గెయినర్స్
ఇండస్‌ఇండ్ బ్యాంక్(IndusInd Bank) 1-2% లాభం గడించింది. షేర్ అసలు ధర రూ. 1,400లు కాగ రూ. 1,430లకు చేరింది. ఎటర్నల్ లిమిటెడ్ 2-3% లాభం అర్జించింది. షేర్ అసలు ధర రూ. 1,336లు కాగ ముగింపు ధర రూ. 1,564 లకు చేరింది. టైటన్ కంపెనీ(Titan Company) 1-2% లాభం పొందింది.
షేర్ అసలు ధర రూ. 3,283లు కాగ రూ. 3,312లకు చేరింది. భారత్ ఎలక్ట్రానిక్స్(Bharat Electronics) 1% లాభం సరిపెట్టుకుంది. షేర్ అసలు ధర రూ. 300లు కాగ ముగింపు ధర రూ. 303లకు చేరింది. ఇక విప్రో కూడా 1% లాభంతో నష్టం నుంచి తప్పించుకుంది. షేర్ అసలు ధర రూ. 470 లు కాగ.. ముగింపు ధర రూ. 475లకు చేరింది.
ఇక BSEలో గెయినర్స్ ను గమనిద్దాం .
వాక్‌హార్డ్ట్ 10% లాభం పొందింది. షేర్ ధర రూ. 800లు, కాగ ముగింపు ధర రూ. 880 లకు చేరింది. సమ్మాన్ క్యాపిటల్ కూడ 10% లాభం పొందింది. షేర్ అసలు ధర రూ. 150లు కాగ, ముగింపు ధర రూ. 165 లకు చేరింది. సుప్రీమ్ పెట్రోకెమ్(Supreme Petrochem) 9 శాతం లాభం లభించింది. ఫేర్ ధర రూ.280లు. ముగింపు ధర రూ. 308లు. |
టాప్ లూజర్స్ ఎవరంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1-2% నష్టాన్నిమూట గట్టుకుంది. షేర్ అసలు ధర రూ. 2,950లు కాగ రూ. 2,900లకు పడిపోయింది. ఇక HDFC బ్యాంక్ 1% నష్టాన్నిసరిపెట్టుకుంది. షేర్ దర 1,650 రూపాయల నుంచి 1,635లకు చేరింది. టాప్ టెక్ కంపెనీ(Top Tech Company) ఇన్ఫోసిస్‌కు 0.5-1% నష్టం తప్పలేదు. షేర్ ధర 1,850 రూపాయల నుంచి 1,840 లకి దిగజారింది.
ITC సైతం 0.5% స్వల్పం నష్టంతో బయట పడింది. షేర్ ధర 490 రూపాయల నుంచి 487లకు చేరింది. TCS కూడా సేమ్ టూ సేమ్. 0.5% నష్టంతో గట్టెక్కింది. షేర్ ధర 4,200రూపాయలు కాగ, రూ.4,180 లకు చేరింది. వేదాంట్ ఫ్యాషన్స్(Vedant Fashions) -5% నష్టంతో తప్పించుకుంది. షేర్ ధర 1,200రూపాయలు కాగ 1,140 లకు చేరింది.
ఓలా ఎలక్ట్రిక్ -4% నష్టంతో రూ.75ల షేర్ 72 రూపాయలకు చేరింది. డీపక్ నైట్రైట్ 3% నష్టంతో 2,500 రూపాయల షేర్ రూ. 2,425లకు చేరింది. కోల్‌గేట్-పాల్మోలివ్ కూడా -3% నష్టంతో 3,000రూపాయిల షేర్ 2,910లకు చేరింది. థర్మాక్స్ 2% నష్టంతో షేర్ ధర 4,500 రూపాయిల నుంచి రూ. 4,410లకు చేరింది.
అగ్రస్థానంలో ఇంధన రంగం
చమురు, గ్యాస్ కంపెనీల స్టాక్‌లు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాయి. కొత్త అన్వేషణ విజయాలు బలమైన కార్యాచరణ నివేదికల తర్వాత ఆయిల్ ఇండియా లిమిటెడ్ ముందుకు సాగింది, ఈ రంగం విస్తృత ధోరణిని అధిగమించడంలో సహాయపడింది. కొన్ని PSU ఇంధన సంస్థలు కూడా లాభపడ్డాయి.
FMCGకి HUL దెబ్బ
FMCG ప్యాక్‌పై హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) భారం తగ్గింది. విశ్లేషకులు గుర్తించిన డిమాండ్.. ఆందోళనల మధ్య స్టాక్ పడి పోయింది, ఇంధనం, చమురు & గ్యాస్, రియాల్టీ, PSU బ్యాంకుల షేర్ల కొనుగోలు ఆసక్తిని రేపాయి. దీంతో ఈ కంపెనీలు కాస్త కుదుట పడ్డాయి. FMCG , విచక్షణా స్టాక్‌లు క్షీణించాయి, IT స్టాక్‌లు దీర్ఘకాలిక ప్రపంచ డిమాండ్ ఆందోళనలతో మృదువుగా ఉన్నాయి. ఆయిల్ ఇండియాతో పాటు, వోకార్డ్ట్ మిడ్-క్యాప్ స్పేస్‌లో గుర్తించదగిన లాభాలను ఆర్జించింది. HUL , టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి IT మేజర్‌లు బలహీనంగా ముగిశాయి.