ఐదు మందికి గాయాలు
కర్నూలు బ్యూరో, ఆగస్టు 11, ఆంధ్రప్రభ : శ్రీశైలం-దోర్నాల (Srisailam-Dornala) ఘాట్ లో సోమవారం ఉదయం ఎదురెదురుగా రెండు బస్సులు (Two buses) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మరి కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంలో ప్రైవేటు బస్సు డ్రైవర్ కాలు ఇరుక్కుపోవడంతో ప్రయాణీకులు అతికష్టం మీద బయటకు తీశారు. తుమ్మల బైలు (Tummalabailu) సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.