అంతర్జాతీయ సదస్సులో తుడా చైర్మన్
- స్వర్ణాంధ్ర గ్రీన్ ఆంధ్ర చంద్రబాబు, లోకేష్ ల లక్ష్యం
తిరుపతి తుడా, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ): ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ప్రతినిధుల సదస్సులో తెలుగుదేశం (Telugu Desam) పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టిటిడి కో- ఆప్షన్ సభ్యులు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన అరైజ్ సిటీస్ ఫోరం 2025 లో తిరుపతి తుడా చైర్మన్ హోదాలో స్పీకర్‌గా డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. భారత గృహ పట్టణ వ్యవహారాల శాఖ, ఐసిఎల్ఈఐ సౌత్ ఏషియా ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో 20కిపైగా దేశాల నాయకులు, మేయర్లు, నగర కమిషనర్లు, ప్రపంచ బ్యాంకు, ఏడిబి, యూఎన్, ఎన్ఐయూఏ, ఐసిఎల్ఈఐ వంటి గ్లోబల్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డాలర్స్ దివాకర్ రెడ్డి (Dollars Divakar Reddy) మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్ర, గ్రీన్ ఆంధ్ర లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. తిరుపతిలో తుడా చేపడుతున్న స్మార్ట్ సిటీ ప్లానింగ్, హీట్ రెసిలిన్స్ సస్టైన్బిలిటీ ప్రాజెక్ట్స్ గురించి వివరించారు. తిరుపతి స్మార్ట్ విజన్ ప్రపంచ వేదికపై ప్రతిధ్వనించిందన్నారు. తిరుపతి తుడాను ప్రపంచ పటంలో నిలపడమే ధ్యేయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు.