TTD | ఛైర్మన్ బీఆర్ నాయుడు

TTD | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హిందూ సమాజానికి వైసీపీ అధినేత వైఎస్.జగన్ క్షమాపణలు చెప్పాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్య మతస్తులు టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని చూశారన్నారు. 60లక్షల కిలోల కల్తీ నెయ్యి కొన్నారన్నారు. రూ.251కోట్ల విలువైన నెయ్యిని తీసుకున్నారన్నారు. అత్యంత ప్రమాదకర కెమికల్స్ ను నెయ్యిలో కలిపారన్నారు. ఎన్ డీడీబీ యానిమల్ ఫ్యాట్ ఉందని రిపోర్టు ఇచ్చిందన్నారు.
కల్తీ నెయ్యితో 20కోట్ల లడ్డూలు తయారయ్యాయన్నారు. చిన్నప్పన్న ఎవరు..? వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదా..? అని ప్రశ్నించారు. క్రిమినల్స్ అంతా కలిసి టీటీడీని బ్లేమ్ చేయాలని చూశారన్నారు. సిట్ రిపోర్టులో క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటుందన్నారు. భోలేబాబా డెయిరీ తనిఖీల్లో ఒక్క ఆవు లేదని తేల్చారన్నారు. మరి 60లక్షల కిలోల నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందన్నారు.
