Trust Board | భక్తులకు జలప్రసాదం, మజ్జిగ పంపిణీ…

Trust Board | భక్తులకు జలప్రసాదం, మజ్జిగ పంపిణీ…
మహా కుంభాభిషేకం సందర్భంగా సేవా కార్యక్రమం
Trust Board | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేకం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు జలప్రసాదం, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు తాలికోట హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తాగునీరు, మజ్జిగ అందజేసి సేవలు అందించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. మహా కుంభాభిషేక వేడుకలకు వచ్చిన భక్తులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.


