ట్రంప్‌ సుంకాలు బ్యాక్ ఫైర్..

సుంకాల మోత మోగిస్తూ ట్రంపు ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్నాడు. చాలా దేశాలు ఆ మోతకి కుయ్యో మొర్రో అంటున్నాయి. ఇది తెలిసిన సంగతే. ట్రంపు మామ నిర్ణయాలతో అమెరికన్ల పరిస్థితి ఏమిటో తెలుసా? వాళ్ళు ప్రపంచ దేశాలందరికంటే ఎక్కువ కుయ్యో కుయ్యొ మొర్రో మొర్రో అంటున్నారు.

ఎందుకంటే ఈ సుంకాల దెబ్బకు ఎక్కువ నషపోతున్నది, నేరుగా దెబ్బ పడింది వాళ్ళమీదకే కనుక. దిగుమతులు తగ్గిపోయి, ఆగిపోయిన వస్తువుల తాలూకు ఉత్పత్తులు ప్రత్యామ్నాయాలు తమదేశంలో లేక అమాంతంగా పెరిగిపోయిన ధరలను తట్టుకోలేకపోతున్నారట. అక్కడి ఖర్చులకు ఒక్కొక్కరు రెండేసి ఉద్యోగాలు చెయ్యడం అమెరికాలో మామూలే. అయినా ఇప్పటి పరిస్థితుల్లో వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటే భవిష్యత్తులో తమ పరిస్థితేమిటని లబోదిబోమంటున్నారు…

Leave a Reply