Trump Self Goal : అమెరికా బొక్క బోర్లా Andhra Praprabha Analysis

Trump Self Goal : అమెరికా బొక్క బోర్లా Andhra Praprabha Analysis
- ఇరాన్ పై వ్యూహం ఫెయిల్?
- బెడిసిన వెనిజుల స్టోరీ
- సుప్రీం ముజ్తబా ఖమేనీ రాకతో..
- ఇరాన్ మరింత దూకుడు
- మధ్యప్రాచ్యంలో యుద్ధం అలజడి
- హోర్ముజ్ జలసంధి సంక్షోభం
- ప్రపంచ చమురు మార్కెట్లకు షాక్
- గల్ఫ్ దేశాల్లో భయం.. భయం
- తూర్పు ఆసియాలో గందరగోళం
( ఆంధ్రప్రభ, ఎనాలసిస్ )

దాదాపు 1000 ఏళ్ల కిందట.. ఓ రాజ్యాధినేతను చంపితే చాలు.. ఆ దేశ ప్రజలందరూ ప్రణమిల్లి దండాలు పెడతారు. కప్పం కడతారు. ఇప్పుడు ప్రపంచంలో ఆ రాచరికం లేదు. దేశాధినేత సంహారాన్ని దేశ ప్రజలు అసలు సహించరు. ఇరాన్ లో అదే జరుగుతోంది. బలహీన దేశాలపై తన సాంకేతిక బలంతో దాడులు జరిపి.. పాలకుల్ని మార్చగలనని.. ప్రపంచాన్ని శాసించే సార్వభౌమ రాజ్యంగా.. అమెరికా ఫస్ట్ నినాదంతో.. వెనిజులా కథను.. మధ్య ప్రాచ్యంలోనూ సృష్టించగలనని.. ఆశించిన అమెరికా బొక్క బోర్లా పడింది. ఇరాన్ లో నాయకత్వాన్ని మార్చగలిగే .. తనకు అత్యంత విశ్వాస కాల భైరవుడు లేకుండానే.. ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రచించిన పేలవ వ్యూహం.. అమెరికాలోనే ట్రంప్ ను జనం ఈసడించుకునే స్థితికి చేరిందంటే కేవలం ఆరోపణ కాదు. సరీగా… 2026 ఫిబ్రవరి 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని సుప్రీం ఖమేనీ నివాసంపై విమానం దాడితో.. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆనరేషన్ ప్రారంభమైంది. అప్పటి వరకూ దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్పణంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన జనం.. తమకు థ్యాంక్స్ చెబుతారని అమెరికా ఆశించింది. అంతే,, తమకు అత్యంత విశ్వాసం ప్రదర్శించే నాయకుడు ఇరాన్ తెర మీదస్తాడని అమెరికా గంపెడాశ పెట్టుకుంది. కానీ ఈ ఆశలన్నీ అడియాశలుగా మారిపోయాయి. ఇప్పుడు ఇరాన్ యోధుడుగా ఖమేనీ కన్న కొడుకు ముజ్తబా ఖమేనీ రథసారధిగా పగ్గాలు చేపట్టాడు. తన రివల్యూషనరీ ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే..
Trump Self Goal : పశ్చిమాసియాలో.. భయం భయం

పశ్చిమాసియా (Middle East) లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు ప్రాంతీయ యుద్ధానికి దారితీశాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన ఈ ఆపరేషన్ సక్సెస్ కావటాన్ని పక్కన పెడితే.. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ భేషరతుగా లొగలేదు. ప్రతీకార దాడులు పెంచింది. తమకు తక్షణమే నాయకుడు లేకపోయినా ఇరాన్ ఎక్కడ తగ్గలేదు. ఈ స్థితిలో యుద్ధం ముగియకపోగా మరింత విస్తరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న జరిగిన తొలి దాడుల్లోనే మరణించారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేన , క్షిపణి వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా ప్రకటించింది.
Trump Self Goal : అమెరికా బొక్క బోర్లా

ఇరాన్‌లో పాలనా మార్పు (Regime Change), అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయటం లక్ష్యంతో రంగంలోకి దిగిన అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్ లోని ఆయిల్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిపి ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. ఈ దాడులతో ఇరాన్ పాలకులను గద్దె దించడం కష్టమని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలే భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Trump Self Goal : గల్ఫ్ దేశాలు గగ్గోలు

గల్ఫ్ దేశాలు ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్నాయి. అమెరికా స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్నాయనే కారణంతో ఇరాన్ తన క్షిపణులను సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లపైకి మళ్లించింది.
బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై సోమవారం ఇరాన్ దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. సాంకేతిక కారణాలతో యూఏఈలో ఒక హెలికాప్టర్ కూలి ఇద్దరు సైనికులు మరణించారు. గల్ఫ్ దేశాల గగనతలం మూతపడింది. వేల సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అమెరికా దాడి ప్రారంభించడంపై, తమను కాపాడటంలో విఫలమవ్వడంపై గల్ఫ్ దేశాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ సూచనలు కనిపించడం లేదు. చమురు ధరలు సుమారు 25% పెరిగి ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
Trump Self Goal : ట్రంప్ ప్లాన్ ఫెయిల్

వెనిజులాలో అమెరికా ప్రదర్శించిన సైనిక దాడి పథకం ఇప్పుడు ఇరాన్‌లోనూ విఫలమైంది. కీలక నాయకుడ్ని చంపేశారే గానీ.. ప్రజల్ని తమ వైపు తిప్పుకోలేక పోయారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ కుప్పకూలుతుందని అమెరికా ఆశించింది. కానీ, వెంటనే ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ పగ్గాలు చేపట్టడం, మిలిటరీ (IRGC) ఆయనకు మద్దతు తెలపడంతో అమెరికా ఆశించిన “అంతర్గత విప్లవం” రాలేదు. ప్రజల స్పందన: ఆంక్షలు మరియు దాడుల వల్ల ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారని అమెరికా భావించింది. కానీ, విదేశీ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజల్లో జాతీయవాదం పెరిగి, వారు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇది వెనిజులాలో జరిగినట్లే అమెరికా వ్యూహాన్ని బొక్కబోర్లా పడేలా చేసింది.
Trump Self Goal : తలకు ముడి చమురు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణంలో, ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ధరల పెరుగుదల: ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు , హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్‌కు $120 మార్కును దాటాయి. అమెరికాలో గ్యాసోలిన్ (పెట్రోల్) ధరలు పెరగడంతో సామాన్య ప్రజల్లో అసహనం మొదలైంది. “అమెరికా ఫస్ట్” అని చెప్పే ట్రంప్, అనవసరంగా మధ్యప్రాచ్య యుద్ధాల్లో తలదూర్చి అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. సౌదీ అరేబియా, యూఏఈలు తమపై దాడులు జరుగుతున్నా అమెరికా రక్షణ కల్పించలేకపోతోందని భావిస్తున్నాయి. దీంతో అవి అమెరికా మాట వినకుండా సొంతంగా రష్యా, చైనాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇది ట్రంప్ విదేశాంగ విధానానికి పెద్ద మైనస్.
అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ తో ఇరాన్ సైనిక సామర్థ్యం కొంత తగ్గినా, రాజకీయంగా, ఆర్థికంగా అమెరికానే ఎక్కువ ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. యుద్ధం సుదీర్ఘంగా సాగితే అది అమెరికాలో ట్రంప్ రీ-ఎన్నికపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
Trump Self Goal : తూర్పు ఆసియా తికమక

పశ్చిమాసియా యుద్ధ మేఘాలు తూర్పు ఆసియా దేశాలు జపాన్, దక్షిణ కొరియాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటు ఇరాన్ కొత్త నాయకత్వం కూడా తన తదుపరి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశాలు ప్రస్తుతం రక్షణ, ఆర్థిక సంక్షోభం మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు ధరలు బారెల్‌కు $114 – $119 కి చేరాయి. ఈరోజు (మార్చి 9) జపాన్ Nikkei 225 సూచీ 5.2%, దక్షిణ కొరియా KOSPI 5.95% భారీగా పతనమయ్యాయి. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్‌లో రూ22.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అమెరికా తన సైనిక వనరులను ఇరాన్ వైపు మళ్ళించడంతో, తూర్పు ఆసియాలో (ముఖ్యంగా ఉత్తర కొరియా , చైనా విషయంలో) రక్షణ వ్యవస్థ బలహీనపడుతోందని జపాన్, దళిణ కొరియా ఆందోళన చెందుతున్నాయి. అమెరికా తన పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలను దక్షిణ కొరియాలోని ఓసాన్ ఎయిర్ బేస్ నుండి ఇరాన్ యుద్ధ రంగానికి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జపాన్ ప్రధాని తకైచి సనే ఇరాన్ అణు ప్రయత్నాలను వ్యతిరేకిస్తూనే, ఇజ్రాయెల్ దాడుల చట్టబద్ధతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు.
Trump Self Goal : ఇరాన్ సుప్రీం వ్యూహం

అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టడం ఇరాన్ వ్యూహంలో కీలక మార్పులకు సంకేతం. ప్రతీకార దాడుల ఉధృతి: బాధ్యతలు చేపట్టిన వెంటనే ముజ్తబా నేతృత్వంలో ఇరాన్ తన తొలి క్షిపణి దాడులను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. సైనిక పట్టు: ముజ్తబాకు ఇరాన్ విప్లవ దళాలతో (IRGC) విడదీయలేని సంబంధం ఉంది. ఆయన వ్యూహం ప్రకారం యుద్ధం ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం కాకుండా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైకి కూడా మళ్లింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ముజ్తబా ఖమేనీకి వ్యూహాత్మక మద్దతు ప్రకటించారు. పశ్చిమ దేశాల ఒత్తిడిని తట్టుకోవడానికి రష్యా, చైనాల సహాయంతో “ఈస్ట్ బ్లాక్” (East Block) బలోపేతం చేయడం ఆయన ప్రధాన లక్ష్యం. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా, అమెరికా డిమాండ్లకు (ముఖ్యంగా అణు నిరోధక ఒప్పందాలు) తలొగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ALSO READ : india-russia-oil: ఇరాన్ స్ట్రాటజీ Andhra Prabha News
