కొత్తగూడ, (ఆంధ్రప్రభ): కొత్తగూడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడ, పెగడపల్లి మధ్య ట్రాలీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.
దుర్గారం గ్రామానికి చెందిన జంగా ఎల్లయ్య-రజితల కుమార్తె జంగా నవ్య (ఇంటర్), జంగా సంపత్-ఎలంద్ర ల కుమార్తె మౌనిక ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కొత్తపల్లి, పెగడపల్లి గ్రామాల మధ్య ట్రాలీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నవ్య, మౌనిక అక్కడికక్కడే మృతి చెందారు.