పోలీసు అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళులు

పోలీసు అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళులు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : దేశ భద్రత, ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని, అవి సమాజానికి స్పూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Gandra Satyanarayana Rao) అన్నారు. ఈ రోజు భూపాలపల్లి పోలీస్ కార్యాలయంలో పోలీసు అమ‌ర‌వీరుల‌కు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ‌రావు ఘ‌న నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా జీవించగలుగుతున్నారంటే అది పోలీసుల నిబద్ధతతో కూడిన సేవల ఫలితం అన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో పోలీసులు(Police) ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలు కూడా పోలీసుల విధులకు సహకరించి, సమాజ శాంతి, భద్రత కోసం తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

అమర వీరుల కుటుంబాలకు బహుమతుల ప్ర‌దానం చేశారు. అనంతరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్(SP Naresh Kumar), డిఎస్పీ సంపత్ రావు, జిల్లాలోని పోలీస్ అధికారులు, జిల్లా అటవీశాఖ అధికారులు ,అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ధర్మపురి, ఆంధ్ర‌ప్ర‌భ : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ ఎలపాటి రాం నర్సింహారెడ్డి అన్నారు. ధర్మపురి(Dharmapuri) పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎంత మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు పులిచెర్ల ఉదయ్ కుమార్మి(Uday Kumarmi), మిర్యాల రవికుమార్, ఫైర్ ఆఫీసర్ శ్రీకాంత్, ధర్మపురి ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు చిలుములలక్ష్మణ్, ఒజ్జల లక్ష్మణ్,గాజు సాగర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పులి రవికుమార్ గౌడ్(Puli Ravikumar Goud), రామస్వామి, కానిస్టేబుల్ లు రమేష్ నాయక్, రణధీర్ గౌడ్, కరబుజ నరేష్, ఆరిప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ క్రైమ్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కరీంనగర్ పోలీస్ కమిషనర్(Commissioner of Police, Karimnagar) కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ గౌస్ అలంతోపాటు పోలీసులు ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివ‌ని, వారి త్యాగాలు వెలకట్టలేవని అన్నారు.

ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో 47 మంది పోలీసులు(47 policemen) అమరులైనట్లు తెలిపారు. వారు చేసిన త్యాగాలు గుర్తు చేస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పోలీస్ అంటే ఒక త్యాగానికి నిర్వచనం అని చెప్పారు.

మాన‌కొండూర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం(Ghaus Alam) అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో సీఐ బొలిమల్ల సంజీవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి గౌస్ ఆలాం హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు.

సీఐ సంజీవ్(CI Sanjeev) మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తుపాకుల గూడెంలో జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఎస్సై ఉండుంటి సంజీవ్ నక్సల్ తో వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, ఎస్సై స్వాతి, సంజీవ్ కుటుంబసభ్యులు, పోలీస్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply