Tributes | చంద్రమ్మకు నివాళులు అర్పించిన నాయకులు

Tributes | మర్రిగూడ, ఆంధ్రప్రభ : రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తానేదారుపల్లి గ్రామనికి చెందిన సిపిఐ మాజీ కార్యదర్శి కర్నాటి అంజయ్య తల్లి కర్నాటి చంద్రమ్మ (80)బుధవారం అనారోగ్యంతో మరణించారు. ఆమె పార్థివ దేహానికి గురువారం స్థానిక సర్పంచ్ లపంగి నర్సింహా, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈదుల బిక్షంరెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, మండల కార్యవర్గ సభ్యులు ఎరుకల నిరంజన్ గౌడ్, సిపిఐ నాయకులు జక్కల అంజయ్య, అబ్బనగోని కృష్ణయ్య, చంద్రయ్య, దేవేందర్, మల్లయ్య, బాలకిషన్ లు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
