Tributes | గన్నవరంలో ఘన నివాళులు

Tributes | గన్నవరం, ఆంధ్రప్రభ : కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని సామాన్యులకు చేరువ చేసిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు . గన్నవరం మండలం వెంకట నరసింహ పురంలో ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు మూల్పూరి బాలకృష్ణ, దాసరి వెంకట బాలవర్ధన్ రావు తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నియోజక వర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి, పేదవాడికి వరి అన్నం పెట్టిన దైవం ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాగే, 1985లో ఆడబిడ్డలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన చట్టాన్ని తెచ్చింది ఎన్టీఆర్ అనే అన్నారు.
చట్టాన్ని ధిక్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లికి ఆస్తి ఇవ్వకపోవడం సిగ్గుచేటని, వెంటనే ఆమెకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, దాని ఆవిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా మంత్రి నారా లోకేష్ ను ఆహ్వానిస్తామని వెల్లడించారు.
విగ్రహ ఏర్పాటుకు సహకరించిన నాయకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు మూల్పూరి బాలకృష్ణ, దాసరి బాలవర్ధన్ రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని, సామాన్యులకు సైతం రాజకీయ అధికారాన్ని అందించిన ఘనత ఆయనదేనని కొనియాడారు.
పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎదిరించిన ధీశాలి ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన చేతుల మీదుగా బి-ఫారమ్ అందుకుని ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం గర్వకారణమని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కళాపరిషత్ అద్యక్షులు యన్.బి.యం మురళీకృష్ణ, గన్నవరం ఏ.యం.సి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, కేసరపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు కోసూరి వెంకటేష్, టిడిపి నాయకులు దయాల రాజేశ్వరరావు, గొడ్డళ్ల చిన్న రామారావు, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, మూల్పూరి సాయి కళ్యాణి, జాస్తి శ్రీధర్, మొవ్వ వెంకటేశ్వరరావు, బోడపాటి రవికుమార్, పుట్టా సురేష్, మేడేపల్లి రమ, కొండేటి వెంకటేశ్వరరావు, మోదుగుమూడి సత్యనారాయణ, గుజ్జర్లపూడి బాబురావు, షేక్ రఫీ, పాలడుగు మల్లిఖార్జునరావు, జొన్నలగడ్డ సుధాకర్, తిరువీధి నరేష్, అన్నే హరికృష్ణ, తంగిరాల శ్రీనివాసరావు, పడమట రంగారావు, నిమ్మకూరి మధు, జాస్తి మురళి, కాసర్నేని రంగబాబు, కొమ్మరాజు సుధీర్, కేసరపల్లి గ్రామ సర్పంచ్ చేబ్రోలు లక్ష్మీ మౌనిక, గండికోట సీతయ్య, కొమ్మారెడ్డి రాజేష్, చిన్నాల లక్ష్మీ నారాయణ, కలపాల కుమార్, కుందేటి చంద్రశేఖర్, మల్లారెడ్డి కిషోర్,దేవినేని సులోచన, ఉయ్యాల మరియమ్మ, జాస్తి రేణుక, అన్నే జ్యోతి లక్ష్మీ, శివపార్వతి, దాసరి శ్వేత, చేబత్తిన సుజాత, పాలడుగు జ్యోతి, కొణతం పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
