Tributes | ఆయన నేటి తరానికి స్ఫూర్తి దాయకం

Tributes | ఆయన నేటి తరానికి స్ఫూర్తి దాయకం
- జయంతి వేడుకల్లో వక్తలు
Tributes | కుంటాల, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాల వాడ నర్సింహా రెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ కొంసాగించాలని పలువురు నాయకులు అన్నారు.. ఆయన నేటి తరానికి స్ఫూర్తి దాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ రోజు కుంటాల మండల కేంద్రంలో స్థానిక వడ్డెర సంఘంలో వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెల్లదొరలతో వీరోచితంగా పోరాడిన మహా యోధుడు, ఉక్కు మనిషి ఓబన్న అని అన్నారు.
ఆయన ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జుట్టు లక్ష్మణ్, మహేందర్, సబ్బిడి గజేందర్, టిఆర్ ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, బీజేపీ నాయకులు తాటి శివ, మాధవ్ రావు, సట్ల శ్రీను, వార్డు సభ్యులు కే.గజేందర్, సుద్ద పు ముత్యం, ఆలూరు ప్రవీణ్, కాశీరామ్ గజేందర్, వడ్డెర సంఘం నాయకులు కే. నగేష్, వేముల ప్రభాకర్, కే. రాజు, సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
