వరహాల గెడ్డలో గిరిజన యువకుడు గల్లంతు

ఆంధ్రప్రభ, పలాస (శ్రీకాకుళం జిల్లా) : పలాస మండలం దానగోర గ్రామానికి చెందిన సవర లావణ్య (లెబున్)(35) కంబిరిగాం జంక్షన్ వరహాల గెడ్డలో బుధవారం గల్లంతు అయ్యాడు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరహాల గెడ్డ ఉదృతంగా ప్రవహించడంతో విపరీతమైన చేపలు దొరుకుతాయని దానగోర గ్రామం నుంచి సుమారు పది మంది యువకులు కంబిరిగాం వరహాల గెడ్డ వద్దకు వచ్చి చేపలు పట్టారు.

అందులో భాగంగా సవర లావణ్య పెద్ద చేప పట్టుకొనే క్రమంలో జారీ పడి గెడ్డలో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో ఉన్న తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నం చేశారు. గెడ్డ ఉదృతంగా ప్రవహించడంతో గల్లంతు అయ్యాడు. విషయం తెలుసుకున్న పలాస తహశీల్దార్ టి కళ్యాణ చక్రవర్తి, డిప్యూటీ తహశీల్దార్ వాయిలపల్లి గిరి, ఆర్ ఐ ప్రసాదరావు, కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

జరిగిన ఘటన పై స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఇంచార్జి కలెక్టర్ పర్మన్ అహమ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళారు. ఇదిలా ఉండగా అగ్ని మాపక సిబ్బంది, ఎన్ డి ఆర్ ఎఫ్, డ్రోన్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం రెవెన్యూ, పోలిస్ అధికారులు ఘటనా స్థలం వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply