ADB |చెట్లతో మానవాళికి మనగడ : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, జులై 7 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ (Utnoor) పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో గల టీడబ్ల్యు గురుకుల బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో ఉపాధ్యాయులతో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కకు నీరు పోశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాటిన మొక్కలను పరిరక్షించాలని, చెట్ల వల్ల మానవాళికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో గ్రామ గ్రామాన చెట్లనాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు కూడ తమ ఇంటి ఆవరణలో చెట్లను నాటి పరిరక్షించుకోవాలన్నారు. ఆయన ఉపాధ్యాయులకు విద్యార్థులకు కోరారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాల నెరవేర్చాలని ఎమ్మెల్యే కోరారు. ఈకార్యక్రమంలో ఉట్నూర్ ఎంపీడీవో రాంప్రసాద్ ఎంపిఓ సుధీర్ రెడ్డి, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జి ఈఓ శంకర్, పీజీఎస్ ఏపీవో రజినీకాంత్ ఈసీ విజేష్, కళాశాల ప్రిన్సిపల్ మనిషా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇగ్బాల్, కాంగ్రెస్ నాయకులు మరుసుకోల తిరుపతి దాసండ్ల ప్రభాకర్, రాజేష్ జాదవ్, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్, నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థినీలు పాల్గొన్నారు.

Leave a Reply