ఆస్పత్రిలో వనమాకు చికిత్సలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao) గాయపడటంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆయన ఆస్పత్రిలో(in hospital) చికిత్స పొందుతున్నారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు(Doctors) ప్రకటించారు.
ప్రమాదం జరిగిందిలా…
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఈ రోజు తెల్లవారు జామున(Tellawaru Jamuna) కాలకృత్యాల నిమిత్తం బాతు రూమ్‌కు వెళ్లారు. బాత్రూమ్(Bathroom)లో జారి పడ్డారు. ఈ విషయాన్నిగమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. వనమా వయసు 80 ఏళ్లు. రాష్ట్రం(State) లోనే అతి పెద్ద వయసు కలిగిన నేత ఆయన ఒకరు.