Treasury Department | ప‌దోన్న‌తుల క‌ల్ప‌న‌కు కృషి..

Treasury Department | ప‌దోన్న‌తుల క‌ల్ప‌న‌కు కృషి..

  • ఏపీ ఎన్‌జీజీవో అధ్య‌క్షుడు ఎ.విద్యాసాగ‌ర్‌.

Treasury Department | విజయవాడ, ఆంధ్రప్రభ : ప్ర‌భుత్వ విభాగాల‌న్నింటితో అనుసంధానంగా ఉంటూ కీల‌క‌మైన సేవ‌లందిస్తున్న ఖ‌జానా శాఖ ఉద్యోగులు, అధికారుల ప‌దోన్న‌తుల విష‌యంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించేందుకు ఏపీ ఎన్‌జీజీవో అసోసియేష‌న్ కృషిచేస్తుందని ఏపీ ఎన్‌జీజీవో అధ్య‌క్షు ఎ.విద్యాసాగ‌ర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్, అకౌంట్స్ గజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు గురువారం విజ‌య‌వాడ‌లోని ఏపీ ఎన్‌జీజీవో అసోసియేష‌న్ భ‌వ‌న్‌లో నిర్వ‌హించారు.

రాష్ట్ర సంఘ నూత‌న కార్య‌వ‌ర్గాన్ని అభినందించిన ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్య‌క్షుడు ఎ.విద్యాసాగ‌ర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో అత్యంత కీల‌మైంది ఖ‌జానా శాఖ అని అన్నారు. ఖ‌జానా శాఖ ద్వారా కీల‌కమైన సేవ‌లందిస్తూ పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న అందించ‌డంలో ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తున్న అధికారులు, ఉద్యోగులు ప‌దోన్న‌తుల విష‌యంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని.. వాటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చి ప‌రిష్క‌రించేందుకు కృషిచేస్తాన‌న్నారు. నూత‌న కార్య‌వ‌ర్గం ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు సంఘ ప్ర‌తిష్ట‌ను మ‌రింత ఇనుమ‌డింప‌జేయాలని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ & అకౌంట్స్ గజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నూత‌న కార్య‌వ‌ర్గం..

విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్‌లోని ఏపీ ఎన్‌జీజీవో అసోసియేష‌న్ భ‌వ‌నంలో గురువారం నిర్వ‌హించిన రాష్ట్ర సంఘ ఎన్నిక‌ల్లో కార్య‌వ‌ర్గంలో ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేష‌న్ మాత్ర‌మే దాఖ‌లు కావ‌డంతో నూత‌న కార్య‌వ‌ర్గం ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ఎన్నిక‌ల అధికారి తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షులుగా పెనుమాక రాజు (ఏఏవో, డీజీపీ కార్యాల‌యం, మంగళగిరి), స‌హాధ్య‌క్షులుగా పి.శంక‌ర్ (ఏటీవో, అన‌కాప‌ల్లి), ప్రధాన కార్యదర్శిగా కె.ఉద‌య్ (జేఏవో, సీఎఫ్ఎంఎస్‌, మంగ‌ళ‌గిరి), కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శిగా ఎ.ఫ‌ణీంద్ర‌రాజు (ఏటీవో, గుంటూరు), కోశాధికారిగా ఎం.మంజునాధ్ (జేఏవో, మంగళగిరి), కార్య‌ద‌ర్శులుగా ఎం.వ‌ల్లీదేవి (ఏఏవో, విజ‌య‌వాడ‌), ఎం.రెడ్డ‌ప్ప‌రెడ్డి (జేఏవో, మంగ‌ళ‌గిరి), కె.శ్రీనివాస‌రావు (ఏఏవో, విజ‌య‌న‌గ‌రం), వి.ర‌ఘురాములు (జేఏవో, విజ‌య‌వాడ‌), ఈసీ మెంబ‌ర్లుగా డీఎన్వీ స‌విత (ఏఎఫ్‌వో, క‌ర్నూలు), ఎస్‌.సునీత (ఏఏవో, అమ‌రావ‌తి), బి.నాసారెడ్డి (జేఏవో, విజ‌య‌వాడ‌), వి.ష‌కీలా (ఏఏవో, గుంటూరు)లు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ఎలక్షన్ ఆఫీసర్ వైజే యేసుదాసు ప్ర‌క‌టించారు. నూతన అధ్యక్షులు పెనుమాక రాజు మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారుల సమ‌ష్టి ప్రయోజనాల కోసం పనిచేస్తామని, ప‌దోన్న‌తుల విషయంలో ఆర్థిక శాఖ అధికారులతో చ‌ర్చ‌లు జరుపుతామని తెలిపారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.ఉద‌య్ మాట్లాడుతూ శాఖాప‌ర‌మైన అభివృద్ధి కోసం కృషిచేస్తామని, ఏటీవోలు-ఏడీ, ఏడీ-డీడీ, డీడీ-జేడీ ప‌దోన్న‌తుల విష‌యంలో రాజీలేని కృషిచేస్తామ‌న్నారు. ఈ కార్యక్రమానికి 26 జిల్లాల నుండి గజిటెడ్ అధికారులు హాజ‌రై ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రంలో ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి బీవీ ర‌మ‌ణ హాజరై వివిధ జిల్లాల నుంచి హాజ‌రైన ఖ‌జానా శాఖ అధికారులు, ఉద్యోగులు నూత‌న కార్యవర్గ సభ్యుల‌కు శుభాకాంక్షలు తెలియజేసారు. అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా టి.సత్యనారాయణ, అబ్సర్వ‌ర్ గా సుబ్రహ్మణ్యం వ్య‌వ‌హ‌రించారు.

Leave a Reply