నంద్యాలలో సాదాసీదాగా ప్రయాణం

నంద్యాలలో సాదాసీదాగా ప్రయాణం

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ(Princess Ganya వినూత్నంగా ఆలోచిస్తారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సమస్యను పరిష్కరించటంలో ఆమె ఆమె సాటి… ఇప్పటివరకు నంద్యాలలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అవినీతి అధికారుల(officers)పై కొరడా గెలిపించారు. ఇప్పటిదాకా 15 మందిని సస్పెన్షన్ చేశారు. కొంగర అధికారులకు చార్జిమెమో(Chargememo)లు ఇచ్చారు.

రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశలో ప్రయత్నిస్తున్నారు. శనివారం ఆటో డ్రైవర్ల(Auto Drivers) సేవలో పథకం ప్రారంభం కార్యక్రమానికి ఇంటి నుంచి నంద్యాల మున్సిపల్ టౌన్ హల్ లో కార్యక్రమం జరిగే వరకు ఆటోలో వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల కు 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో… నంద్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్‌(Town Hall)లో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ప్రారంభించారు.

జిల్లా వ్యాప్తంగా 10, 006 మందికి లబ్ది చేకూరనుంది. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆటోలో వచ్చిన కలెక్టర్ రాజకుమారి(Rajakumari)కి ఆటో డ్రైవర్లు ఆర్టీవో శివారెడ్డి స్వాగతం పలికారు.

Leave a Reply