
Transformer | లో వోల్టేజ్ సమస్యకు చెక్
Transformer | లో వోల్టేజ్ సమస్యకు చెక్
Transformer | వేంసూరు, ఆంధ్రప్రభ : లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని లచ్చన్నగూడెం సర్పంచ్ చక్రధర్ విజ్ఞప్తి మేరకు విద్యుత్ శాఖ ఏఇ అంకారావు నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్సీ కాలనీ లో వోల్టేజ్ సమస్య నెలకొంది. సర్పంచ్ చక్రధర్ దృష్టికి స్థానికులు తీసుకెళ్ళటంతో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన ప్రజాబాట కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖ లోవల్టేజ్ సమస్య రాకుండా నివారణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా 25 కే.వి నూతన నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చక్రధర్, ఏఇ అంకారావు, విద్యుత్ శాఖ లైన్ మేన్ సాయిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.
