పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

బాల్కొండ, ఆంధ్రప్రభ : బాల్కొండ మండలంలోని పలు గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు పంచాయతీ కార్యదర్శులు గురువారం బదిలీపై వెళ్లారు.బాల్కొండ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న రాజలింగంను వేల్పూర్ మండలం మోతే గ్రామానికి,మోపాల్ మండలం కల్పోలె పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న మోహన్ బాల్కొండ కు బదిలీ అయ్యారు.
కిసాన్ నగర్ పంచాయతీ కార్యదర్శి రేణుక దేవి ఆర్మూర్ మండలం ఇస్సాపల్లికి, ఆర్మూర్ మండలం రాంపూర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కిసాన్ నగర్ కు బదిలీ అయ్యారు.ఇత్వార్ పేట్ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ ను శ్రీరాంపూర్ కు,శఅక్కడ విధులు నిర్వహిస్తున్న గణేష్ ఇత్వార్ పేట్ కు బదిలీ అయ్యారు.
వన్నెల్ (బి) పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ను మోర్తాడ్ మండలం దొన్కల్ కు, అక్కడ విధులు నిర్వహిస్తున్న స్వప్నను వన్నెల్ (బి) కు బదిలీ అయ్యారు.బాల్కొండ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ ను కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామ పంచాయతీ కి ఉన్నతాధికారులు బదిలీ చేశారు.బాల్కొండ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా రాజలింగం బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడవక ముందే మరోసారి బదిలీ కావడం గమనార్హం.
