హైదరాబాద్ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు జారీ
ఖమ్మం వైద్య విభాగం, జులై 8(ఆంధ్ర ప్రభ) : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జనరల్ ఆస్పత్రి (Khammam Government Medical College, General Hospital) అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వ సెక్రటరీ ఉత్తర్వులు (Orders) జారీ చేశారు. ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా డాక్టర్ టి శంకర్ (Dr.T Shankar), జీజీహెచ్ సూపరింటెండెంట్ ను డాక్టర్ ఎం.నరేందర్ (Dr. M. Narender) ను నియమించారు.
ప్రస్తుతం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేశ్వరరావు హెచీడి మైక్రో బయాలజీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న డాక్టర్ కిరణ్ కుమార్ హెచ్ ఓ డి ఆర్థోపెడిక్ డిపార్ట్ మెంట్ కు వెళ్లనున్నారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జనరల్ ఆసుపత్రి అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.