tragic incident | ఏమైదంటే….

tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డ్యూటీలో ఉన్న యువ వైద్యురాలు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన దీపిక, ఎంబీబీఎస్ పూర్తి చేసి జీజీహెచ్‌లో మెడిసిన్ పీజీ చేస్తోంది. రాత్రి నుంచి డ్యూటీలో ఉన్న ఆమె, తెల్లవారుజామున అపస్మారక స్థితిలో పడిపోగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ స్వయంగా ఇంజెక్షన్ తీసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత వెలుగులోకి రానున్నాయి.

Leave a Reply