Trafic Police | నో హెల్మెట్.. నో రైడ్..

Trafic Police | నో హెల్మెట్.. నో రైడ్..

హెల్మెట్ వాడదాం.. ప్రాణాలు కాపాడదాం..
విజయవాడ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో….
ఎన్ సీ సీ విద్యార్థుల భాగస్వామ్యంతో భారీ ర్యాలీ..

Trafic Police | పటమట, ఆంధ్రప్రభ : రహదారి భద్రతను కాపాడడం.. ప్రమాదాలను తగ్గించడం.. హెల్మెట్ (Helmet) వాడకాన్ని పెంచడం.. ప్రాణాలను రక్షించడం వంటి సంకల్పంతో విజయవాడ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు విస్తృత స్థాయిలో చైతన్యం కల్పిస్తున్నారు. రహదారి ప్రమాదాలు తగ్గించడం.. ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా నో హెల్మెట్… నో రైడ్.. స్లొగన్తో నగరంలో భారీ ర్యాలీని చేపట్టారు. రహదారి భద్రత హెల్మెట్ ధరించడం ప్రాముఖ్యతను వివరించడం.. అవగాహన కల్పించడం.. వాహనదారులకు చైతన్యం కల్పించే విధంగా ఎన్సీసీ విద్యార్థులతో భాగస్వామ్యంతో విజయవాడ నగరంలో హెల్మెట్ అవగాహన ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. విజయవాడలోని మొగల్రాజపురం లో ఉన్న సిద్ధార్థ కళాశాల నుండి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Trafic Police

రహదారి ప్రమాదాల (Road Accidet) సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా రక్షిస్తాయి..? తలకు తీవ్రమైన గాయాలను నివారించడంలో ఎలా సహాయపడతాయి..? అనే విషయాలను ప్రజలకు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించడానికి విద్యార్థులు పలు స్లోగన్లతో పాటు బ్యానర్లు ప్లే కార్డులను ప్రదర్శించారు. హెల్మెట్ ధరించండి జీవితాన్ని కాపాడండి నో హెల్మెట్ నో రైడ్ వంటి భద్రత నినాదాలతో కూడిన ప్లే కార్డులను బ్యానర్లను పట్టుకుని విద్యార్థులు ఈ ర్యాలీలో అందరికీ అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సీఐ రవికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భారీ ర్యాలీకి విద్యార్థులతో పాటు వాహనదారుల నుండి కూడా అనూహ్య స్పందన లభించింది.

Trafic Police

Leave a Reply