మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రం….

మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రం….

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో వాహనాలను ఇష్టనుసారంగా రోడ్డుపై పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రధాన రహదారిపై బ్యాంకులు, దుకాణాల ఎదుట ద్విచక్ర వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు మండల కేంద్రానికి చేరుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

వాహనాలు రోడ్డుమధ్యలో పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక వ్యాపారులు, వాహనదారులు పార్కింగ్ నిబంధనలు పాటించకపోవడం ప్రధాన కారణంగా మారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply