వ్యాపారులు దూరం

- లాటరీలు వేసిన ఎక్సైజ్
ఆంధ్రప్రభ, అనంతపురం : నూతన మద్యం పాలసీలో భాగంగా రెండవ దఫా రీ నోటిఫికేషన్ మేరకు అనంతపురం (Anantapur) జిల్లాలో 9 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, రెండు బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి.
కళ్యాణదుర్గం, గుత్తి (Kalyanadurga, Guthi) లో రెండు బార్లకు అభ్యర్థి ఎంపికకు లాటరీ పద్ధతిలో జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ అనంతపురం కార్యాలయంలో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ (Collector O. Anand) ఆధ్వర్యంలో పారదర్శకంగా దరఖాస్తుదారుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లాటరీ పద్ధతిలో ఎంపికైన అర్హులకు అంగీకార పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.రామమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
